ఇండోనేషియా ఆటో షోలో సిబిర్ 250ఆర్ఆర్ ప్రదర్శన
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్‌కు చెందిన సిబిఆర్ 25ఆర్ఆర్ బైకును ఇండోనేషియాలో జరుగుతున్న 2016 జిఐఐఎఎస్ ఆటో షో లో ప్రదర్శించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సింగల్ సిలిండర్ సిబిఆర్300ఆర్ కన్న ఎక్కువ స్థానాన్ని భర్తీ చేయనుంది.

హోండా ఈ సిబిఆర్ 250ఆర్ఆర్‌ను మొదిటి సారి 2015 టోక్యో మోటార్ షో లో ప్రదర్శించారు.

పూర్తి స్థాయిలో అభివృద్ది చెందిన ఈ హోండా సిబిఆర్ 250ఆర్ఆర్ ప్రస్తుతం ఉన్న యమహా ఆర్3, కవాసకి నింజా 300 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 లకు పోటీగా నిలవనుంది.

ప్రస్తుతం ఆటో షోలో ప్రదర్శనకు దిగిన సిబిఆర్ 250ఆర్ఆర్‌లో రేజర్ షార్ప్ డిజైన్‌ను అందించారు, న్యారో ఎల్‌ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు ఎల్‌ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను అందించారు.

సన్నగా, పదునుగా ఉన్న టెయిల్ సీటు, ఎల్ఇడి టెయిల్ లైట్లు, పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మరియు ట్విన్ ఎగ్జాస్ సిస్టమ్‌లు ఉన్నాయి.
ఈ

ఈ హోండా సిబిఆర్ 250ఆర్ఆర్ లో 249సీసీ సామర్థ్యం ఉన్న రెండు సిలిండర్ల ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది.

ఇందులో చాలా వరకు ఎలక్ట్రిక్ ద్వారా ఆపరేట్ చేయగలిగే కంట్రోల్స్ ఉన్నాయి, మరియు రైడ్ బై వైర్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.

- ఇండియన్ కస్టమర్ల టేస్ట్‌కు అనుగుణంగా విడుదల కానున్న ఎస్‌యువిలు: మరింత చదవండి


Click it and Unblock the Notifications








