ఎక్స్ పో వేదిక మీద బెనెల్లీ టొరాండో టి-135 ప్రదర్శన: ఫోటోలతో కూడిన వివరణ
ఇటలీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ద్విచక్ర వాహనల తయారీ సంస్థ డిఎస్‌కె బెనెల్లీ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించడానికి భారీ స్థాయిలో తమ ఉత్పత్తులను సిద్దం చేసుకుంది. అందులో భాగంగా డిఎస్‌కె బెనెల్లీ తమ టొరాండో నేక్డ్ టి-135 బైకును ఎక్స్ పోలో ప్రదర్శించింది.

డిఎస్‌కె బెనెల్లీ టొరాండో టి-135 బైకును ఫోటోలలో గమనించండి
దేశానికి రైతు వెన్నెముక అన్నది ఎంత సత్యమో, ఆధునిక కాలానికి చెందిన బైకులకు డిజైన్ కూడా అంతే ప్రాధాన్యం. ఈ టొరాండో బైకు చూడ్డానికి నేక్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ముందు మరియు వెనుకవైపున 12-అంగుళాల చక్రాలను మరియు వెనుక వైపున రెండు ఎగ్జాస్ట్ పైపుల (సైలెన్సర్లు) ను అందించారు.
టొరాండో టి-135 బైకు సాంకేతిక వివరాలు:
- ఇంధన రకము: పెట్రోల్
- ఇంజన్ సామర్థ్యం: 134.7సీసీ
- శక్తి: 12.5 బిహెచ్‌పి
- గేర్ బాక్స్: 5-స్పీడ్
- టార్క్: 10.8 ఎన్ @ 7,000 ఆర్‌పిఎమ్
- ఇంజన్ టైప్: 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్
- చక్రాలు: రెండు వైపులా అల్లాయ్ చక్రాలు
- ఇంధన ట్యాంక్ కెపాసిటి: గరిష్టంగా 7.2-లీటర్లు
- ఇంధన సరఫరా: ఎలక్ట్రానిక్ ఇంధన సరఫరా పరికరం
AUTO EXPO NEWS: కేవలం రూ. 39,500 లకే విడుదలైన హోండా నవీ స్కూటర్ ఫోటోలు, విడుదల వివరాలు
హెడ్ లైట్లు చూడటానికి భవిష్యత్తు పరిజ్ఞానాన్ని పోలి ఉండి మరియు ప్రొజెక్టర్ ల్యాంప్ తరహాలో మనకు దర్శనం ఇస్తుంది. ముందు వైపున గల ఇండికేటర్స్ చాలా అందంగా చిన్నవిగా మరియు వెనుక వైపున గల టెయిల్ ల్యాంప్ మరియు ఇండికేటింగ్ లైట్లు సీటు క్రింది భాగంలో గల డీకాల్స్ క్రింద డిజైన్ చేశారు.


Click it and Unblock the Notifications























