ఇండియన్ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లోకి పనిగాలా 959 బైకును విడుదల చేసిన డుకాటి

By Anil

క్రితం రోజున ప్రసిద్ద 2016 ఇండియన్ బైక్ వీక్ గోవాలో ఘణంగా ప్రారంభమయ్యింది. అయితే దీనిని వేదికగా చేసుకుని డుకాటి తమ పనిగాలా 959 బైకును విడుదల చేసింది. అయితే ప్రేక్షకులకు రెండు విదాలుగా కనువింమదు చేయడానికి ఇటు ఇండియన్ బైక్ వీక్ మరియు ప్రముఖ టూవీలర్ల సంస్థలు తమ వైవిధ్యమైన స్పోర్ట్స్ బైకులను విడుదల చేస్తున్నాయి.
Also Read: 1.49 లక్షల ప్రారంభ ధరతో ముచ్చటగా మూడు బైకులు: దీని దెబ్బతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికే
డుకాటి వారి పనిగాలా 959 స్పోర్ట్ బైకు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

పనిగాలా 959 ఇంజన్‌లో ప్రతి సిలిండర్‌‌కు నాలుగు వాల్వ్‌లతో గల ఎల్-ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

 ఇంజన్ కెపాసిటి

ఇంజన్ కెపాసిటి

పనిగాలా 959 లోని 959 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు

 పవర్

పవర్

పనిగాలా 959 ఇంజన్‌ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద దాదాపుగా 157 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 టార్క్

టార్క్

పనిగాలా 959 లోని ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 107.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

 ట్రాన్స్‌మిషన్

ట్రాన్స్‌మిషన్

పనిగాలా 959 బైకులోని శక్తివంతమైన ఇంజన్ విడుదల చేసే పవర్‌ను ఇందులోని 6-స్పీడ్ గేర్ బాక్స్ చైన్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి అందిస్తుంది.

 సస్పెన్షన్

సస్పెన్షన్

స్పోర్ట్ బైకులకు మంచి ఇంజన్ కెపాసిటితో పాటు మంచి రైడింగ్ సౌలభ్యం కోసం చక్కటి సస్పెన్షన్ సస్టమ్‌ను కల్పించాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది. ముందు వైపున 120 ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 130 ఎమ్ఎమ్ ట్రావెల్‌తో మోనో షాక్ అబ్జార్వర్‌ను అందించారు.

బ్రేకులు

బ్రేకులు

పనిగాలా 959 బైకును ఎటువంటి వేగం వద్ద అయినా నిలపడానికి ముందు వైపున 320 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల రెండు డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 245 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల సింగల్ డిస్క్ గల బ్రేకును అందించారు.

చక్రాలు

చక్రాలు

ముందు వైపున 10 స్పోక్స్ గల 17-అంగుళాల అల్లాయ్ వీల్ మరియు వెనుక వైపున కూడా 17- అంగుళాల అల్లాయ్ వీల్‌ను అందించారు.

టైర్లు

టైర్లు

ముందు వైపు చక్రానికి 120/70 కొలతలు గల పిరెల్లీ రొస్సొ కోర్సా టైరును మరియు వెనుక వైపున టైరుకు 130/80 కొలతలతో గల పిరెల్లి వారి రొస్సొ కోర్సా టైర్లను అందించారు.

డిజైన్

డిజైన్

డుకాటి వారి పనిగాలా 899 బైకుతో పోల్చుకుంటే ఇందులో విసృతమైన ఫీచర్లు మరియు భద్రత పరంగా ముందు వైపున వెడల్పాటి విండ్ స్క్రీన్ కలదు. దీనిని వలన పనిగాలా 959 చూడాటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.

 ఇండియన్ బైకు వీక్ వేదిక మీద విడుదలైన డుటాకి పనిగాలా 959

పనిగాలా 899 బైగులో ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను సీటు క్రింది భాగంలో ఇవ్వడం వలన దీనిని లుక్ దాదాపుగా వేస్ట్ అని చెప్పవచ్చు. అయితే డుకాటి దీనికి వ్యతిరేకంగా తమ పనిగాలా 959 బైకులో రెండు విడిపోయిన ఎగ్జాస్ట్ గొట్టాలను కుడిచేతి వైపు నుండి వెనుకకు మళ్లించారు.

అందుబాటులోకి

అందుబాటులోకి

సౌకర్యవంతమైన రైడింగ్ బైకులను అందిస్తున్న డుకాటి తమ పనిగాలా 959 బైకును ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

 పోటి

పోటి

ఇండియన్ మార్కెట్లో గల 100 సీసీ నుండి 1000 సీసీ బైకుల వరకు అన్నింటికి పోటి కలదు. డుకాటి వారి పనిగాలా 959 బైకు యమహా వైజడ్‌ఎఫ్-ఆర్1,హోండా సిబిఆర్1000ఆర్ఆర్ మరియు సుజుకి జిఎస్‌ఎక్స్‌ఆర్ 1000 వంటి బైకులకు పోటీగా నిలవనుంది.

 ఇండియన్ బైకు వీక్ వేదిక మీద విడుదలైన డుటాకి పనిగాలా 959
  • దేశీయ మార్కెట్లోకి అబ్బురపరిచే బైకు: ఇండియన్ రోడ్ మాస్టర్
  • యమహా ఎమ్‌టి-09 స్ట్రీట్‌ ఫైటర్ విడుదల:దీన్ని కొనే సత్తా ఉందా
  • బెనెల్లీ నుండి అడ్వెంచర్ టూరర్ బైకు

Most Read Articles

English summary
Ducati 959 Panigale Scythes Into India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X