దేశీయ విపణిలోకి డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో విడుదల ధర రూ. 17.44 లక్షలు

By Anil

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి దేశీయ విపణిలోకి తమ మల్టీస్ట్రాడా 1200 ఎండురో బైకును విడుదల చేసింది. డుకాటి ఈ అడ్వెంచర్ బైకు ప్రారంభ ధర రూ. 17.44 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది దేశీయంగా ఉన్న ముంబాయ్, పూనే, ఢిల్లీ మరియు బెంగళూరు నగరాలలోని అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో అడ్వెంచర్ బైకు గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

సుమారుహా పదిహేడున్నర లక్షల ధరతో విడుదలైన మల్టీస్ట్రాడా 1200 ఎండురో బైకులో 1,198 సీసీ సామర్థ్యం ఉన్న ఎల్-ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డెస్మోడ్రామిక్ ఇంజన్‌ కలదు.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 160బిహెచ్‌ పవర్ మరియు 136ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

రైడింగ్ మోడ్స్

రైడింగ్ మోడ్స్

చాలా వరకు కార్లలో మనం వివిధ రకాల డ్రైవింగ్‌ మోడ్స్‌ను చూస్తుంటాం. కాని డుకాటి సంస్థ ఈ మల్టీస్ట్రాడా 1200 ఎండురో బైకులో స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండురో అనే నాలుగు రైడింగ్ మోడ్లను అందించారు.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

డుకాటి సంస్థలోని ఇంజనీర్లు ఇందులో స్కైషాక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, వీలి కంట్రోల్, కార్నరింగ్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు అత్యంత అధునాతమైన రైడ్ బై వైర్ సిస్టమ్‌ను ఇందులో అందించారు.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

ఈ అడ్వెంచర్ బైకు ద్వారా రైడింగ్ చేస్తున్న సమయంలో గాలిలోకి ఎగిరినపుడు మరియు నేల మీద ల్యాండ్ అయినపుడు ముందు వైపు ఉన్న ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్ మీద చూపిస్తుంది. అదే విధంగా అక్కడ నుండే సస్పెన్షన్ రీకాయిల్ అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం కూడా కలదు.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

డుకాటి సంస్థ ఈ మల్టీస్ట్రాడా 1200 ఎండురో బైకులో క్రుయిజ్ కంట్రోల్ మరియు హ్యాండ్స్ ఫ్రీ ఇగ్నిషన్ సాంకేతికతలను పరిచయం చేసింది.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

మల్టీస్ట్రాడా 1200 ఎండురోలో డుకాటి మల్టీ మీడియా సిస్టమ్‌ను అందించారు. తద్వారా రైడర్లు తమ స్మార్ట్ ఫోన్‌లను బ్లూటూత్ ద్వారా మల్టీ మీడియా సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

రైడర్లు దీనిని రైడ్ చేస్తున్నపుడే మ్యూజిక్ వినవచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు, మెసేజ్‌లకు సమాధానం ఇవ్వవచ్చు అదే విధంగా తమ రైడింగ్‌ను రికార్డ్ చేసి సామాజిక వేదికల మీద షేర్ కూడా చేయవచ్చు.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

డుకాటి సంస్థ ఈ మల్టీస్ట్రాడా 1200 ఎండురో బైకును దేశ వ్యాప్తంగా ఉన్న ముంబాయ్, పూనే, ఢిల్లీ మరియు బెంగళూరు వంటి నగరాలలో అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంచింది.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండురో

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌‌ డ్రైవింగ్‌లో చేయకూడని తప్పులు

దేశీయంగా విడుదల కానున్న రియో ను ఆవిష్కరించిన కియా మోటార్స్

More from DriveSpark

Article Published On: Friday, August 26, 2016, 11:28 [IST]
English summary
Ducati Multistrada 1200 Enduro Now Available At Rs. 17.44 Lakh In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+