డుకాటి ఎక్స్‌డైవెల్ విడుదల ప్రారంభ ధర రూ. 15.87 లక్షలు
ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన రెండు ఉత్పత్తులను విడుదల చేసింది. ఎక్స్‌డైవెల్ మరియు ఎక్స్‌డైవెల్ ఎస్ అనే వాటిని వరుసగా 15.87లక్షలు మరియు 18.47 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేసింది.

డుకాటి వారి ఈ రెండు ఉత్పత్తులు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యార్లీడేవిడ్సన్ మరియు ఇండియన్ మోటార్ సైకిల్స్ వారి శ్రేణిలోని ఉత్పత్తులకు పోటీగా నిలవనున్నాయి.

డుకాటి ఎక్స్‌డైవెల్ మరియు ఎక్స్ డైవెల్ ఎస్ రెండు బైకులకు సంభందించిన బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించారు.

సాంకేతికంగా డుకాటి ఎక్స్‌డైవెల్ బైకులో 1262సీసీ సామర్థ్యం ఉన్న డుకాటి టెస్టాస్ట్రెట్టా డిటివి ఎల్-ట్విన్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 156బిహెచ్‌పి పవర్ మరియు 129గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. దీని గరిష్టం వేగం గంటకు 240కిలోమీటర్లుగా ఉంది.

ఫీచర్ల పరంగా ఈ డుకాటి ఎక్స్‌డైవెల్ బైకులోని ముందు వైపున అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అప్‌సైడ్ ఫ్రంట్ పోర్క్స్‌ని మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్‌ను అందించారు. రెండు చక్రాలకు కూడా డిస్క్ బ్రేకులను కల్పించారు. ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మీద టిఎఫ్‌టి తెరను అందించారు.

అధునాతన సాంకేతికంగా కూడా ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి. అందులో మోటార్ సైకిల్‌ను గ్యాడ్జెట్‌ల ద్వారా నియంత్రించడం. అందులో డుకాటి పవర్ లాంచ్ (డిపిఎల్), డుకాట్ ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి)

బాష్ సంస్థకు చెందిన కార్నరింగ్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, కీ లెస్ ఇగ్నిషన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, విభిన్న రకాల డ్రైవింగ్ మోడ్స్ మరియు హ్యాండ్స్ ఫ్రీ కనెక్టివిటీ వంటి భద్రత ఫీచర్లను కూడా ఇందులో అందించారు.

- జేమ్స్‌బాండ్ మూవీ షూట్ కాదండోయ్... పోర్షే ప్యానమెరా ప్రదర్శన !!
- చైనాలో విమాన రెస్టారెంట్: భారత్‌లో ఎక్కడుందో తెలుసా ?
- షాక్: 150సీసీ సామర్థ్యం గల బైకును విడుదల చేయనున్న బెనెల్లీ
- ఏ రిస్కు లేకుండా కారు భీమా చేసుకోండి.... పూర్తి వివరాలకు !!



Click it and Unblock the Notifications








