మోసపూరిత కేసులో ఈడర్ మోటార్స్ ఛైర్మెన్ అరెస్టు
దేశీయంగా ఈడర్ మోటార్స్ సైకిల్స్ సంస్థను ప్రారంభించిన చైర్మెన్ మరోజు శివ కుమార్‌ను హైదరబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేసారు. సుమారుగా 40 మంది పెట్టుబడి దారులను మోసం చేసిన కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ మోసంలో సుమారుగా 10 కోట్ల రుపాయల వరకు ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు తెలిసింది.

ఈడర్స్ మోటార్స్ పేరుతో, తమకు గుజరాత్‌లో వాహనాల ఉత్పత్తి ప్లాంటు ఉంది, తయారీకి సంభందించిన లైసన్స్ కూడా ఉన్నట్లు మరియు జర్మనీ అదే విధంగా జపాన్‌కు చెందిన సంస్థ ల భాగస్వామ్యంతో ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని ప్రారభిస్తామని నమ్మబలికాడని కోకా పేటకు చెందిన నర్శింగ్ (36) చెప్పుకొచ్చాడు.

సీనియర్ నేర నియంత్రణ అధికారి మాట్లాడుతూ, "శివ కుమార్ తన సంస్థ గురించి వార్తా పత్రికలు, ఈడర్ మోటార్ సైకిల్ వెబ్‌సైట్ అదే విధంగా కొన్ని వార్తా ఛానళ్ల ద్వారా గుర్గాన్ లో తయారీ ప్లాంటు ఉందని ప్రకటించుకున్నాడు" అని తెలిపాడు.

సమాచార వర్గాల కథనం ప్రకారం తమ ఈడర్ మోటార్ సైకిల్స్ సంస్థకు జర్మనీ నుండి డిజైన్ సహాయం అదే విధంగా జపాన్ నుండి విడి పరికరాల సహాయం ఉందని దీని ద్వారా త్వరలో బైకుల ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపి ఇందుకోసం డీలర్లు కావాలని పెట్టుబడిదారులను ఆకర్షించాడు.హైదరాబాద్ లోని హిమాయత్ నగర్‌లో వాహనాల అసెంబ్లింగ్ ఉన్నట్లు కూడా పెట్టుబడిదారులను ఆకర్షించాడు.

అయితే శివ కుమార్‌కు చెందిన ఈడర్ బైకుల కోసం డీలర్ షిప్ ప్రారంభించడానికి ఆసక్తిపరులు ముందుకు రావడంతో. వారు ఒక్కో బైకు మీద సుమారుగా 6,000 నుండి 12,000 రుపాయల వరకు లాభం పొందే అవకాశం ఉన్నట్లు మరియు ప్రతి నెల కూడా షోరూమ్ మెయింటెనెన్స్ కోసం 50,000 రుపాయలను అందజేస్తామని శివ కుమార్ వారిని బాగా మభ్య పెట్టాడు.

అదే నిజం అని భావించిన సుమారుగా 40 మంది పెట్టుబడిదారులు శివ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకుని 20 నుండి 40 లక్షల రుపాయల వరకు అతని చేతిలో పెట్టారు.

అయితే డబ్బు తీసుకున్న తరువాత ఎన్ని రోజులకు బైకులను డీలర్లకు సరఫరా చేయడంలో శివ కుమార్ విఫలం చెందాడు. ఇందుకు గాను పెట్టుబడిదారులు పోలీసులను ఆశ్రయించి శివకుమార్ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఈడర్ మోటార్ సైకిల్స్ ఛైర్మెన్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

మీ అభిరుచికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ ప్యాకేజిని ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్న ఏకైక సంస్థ


Click it and Unblock the Notifications








