టీవీఎస్ విగో ద్వారా ఇండియన్ ఫెస్టివ్ సీజన్ గురించి
దేశ మొత్తం ఈ ఏడాది పండుగ వాతావరణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి సిద్దమైంది. ప్రతి ఏడాది కూడా చివరి మూడు నెలలు పండుగ వాతావారణాన్ని నెలకొల్పుతాయి. సువిశాల భారత దేశంలో ఒక్కో ప్రాంతం, ఒక్కో పండుగకు ప్రత్యేకం. ఇందులో వివిధ రకాల సాంప్రదాయాలకు ఆ ప్రదేశాలు పెట్టింది పేరు.
ఈ పండుగ సీజన్‌లో వివిధ నగరాలను టీవీఎస్ విగో (#TVSWego) ద్వారా సందర్శించి భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను ఆ ప్రాంత ప్రత్యేకతలను వివరిస్తూ డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ కోసం విభిన్న కథనాలను ప్రచురించనుంది.

ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా రానున్న నాలుగు నెలల కాలంలో అన్ని పండుగలను జరుపుకుంటారు. ఇందు కోసం డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రతి ప్రముఖ నగరాన్ని టీవీఎస్ విగో ద్వారా సందర్శిస్తూ ఈ నగరంలో జరిగే పండుగ వేడుకల విశేషాలను పాఠకులతో పంచుకోనుంది.
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం డ్రైవ్‌స్పార్క్ బృందం కలకత్తాలో జరిగే దుర్గా పూజ మహోత్సవానికి హాజరై అక్కడి సాంస్కృతిక సాంప్రదాయలతో మిళితమైన విశేషాలను టీవీఎస్ విగో ద్వారా మనకు పరిచయం చేయనుంది.
ఇలాగే ఈ పండుగ సీజన్ ముగిసేలోపు #WegoKolkata తో పాటు బెంగళూరు, చెన్నై, కొచ్చిన్ మరియు పూన్ వంటి ప్రముఖ నగరాలలో జరిగే అతి ముఖ్యమైన పండుగలను డ్రైవ్‌స్పార్క్ టీవీఎస్ విగోతో కలిసి జరుపుకోని వీటి ప్రత్యేకతలను మీ ముందుకు కథనాలుగా తీసుకురానుంది.

టీవీఎస్ విగో మరియు డ్రైవ్‌స్పార్త్ బృందం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలలో ప్రముఖ పండుగులను జరుపునే విషయాలను తెలుసుకోవడానికి మాతో కలిసి ఉండండి.


Click it and Unblock the Notifications








