విపణిలోకి హీరో అచీవర్ 150 విడుదల: ప్రారంభ ధర రూ. 61,800 లు
హీరో మోటోకార్ప్, భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ నేడు ఇండియన్ మార్కెట్లోకి అచీవర్ 150 ని విడుదల చేసింది. హీరో ఈ కొత్త తరం అచీవర్ 150 లో తమ అధునాతన ఐ3ఎస్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది.

హీరో అచీవర్ 150 ధర వివరాలు
- అచీవర్ 150 డ్రమ్ వేరియంట్ ధర రూ. 61,800 లు
- అచీవర్ 150 డిస్క్ వేరియంట్ ధర రూ. 62,800 లు

సరికొత్త 2016 అచీవర్ 150 లో హీరో దేశీయంగా అభివృద్ది చేసిన 149.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 13.4బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 12.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

బిఎస్-IV ఉద్గార నియమాలు పాటించే ఈ ఇంజన్‌కు ఐ3ఎస్ పరిజ్ఞానాన్ని అందించారు. ఆటోమేటిక్‌గా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ ద్వారా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది.

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ను వెనుక చక్రానికి సరఫరా చేయడానికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

సరికొత్త 2016 అచీవర్ 150 కేవలం ఐదు సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది.

సరికొత్త 2016 అచీవర్ 150 లో ముందు వైపు చక్రానికి ఆప్షనల్‌గా 240ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకును అందించారు.

డిజైన్ పరంగా ముందు వైపున ఉన్న హెడ్ ల్యాంప్‌ను అర్థ సమాంతర చతుర్భుజ ఆకారంలో అందించారు, పెద్ద పరిమాణంలో ఉన్న ఇంధన ట్యాంకు దీనికి మంచి కండలు తిరిగిన రూపాన్ని అందించింది. ఇక బాడీ మీద చిన్న పాటి గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి.

2016 అచీవర్ 150 మూడు విభిన్న రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అవి, పాంథర్ బ్లాక్ మెటాలిక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్ మరియు ఎబోనే గ్రే మెటాలిక్.

సుమారుగా 700 లక్షల సంతృప్తి చెందిన వినియోగదారులను గ్రహించినందుకు, సరికొత్త అచీవర్ ను స్పెషల్ ఎడిషన్ రూపంలో విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా కేవలం 70 అచీవర్ బైకులను మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.

- భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!
- సంచలనాలు సృష్టించిన టూ వీలర్లు...!!
- లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు


Click it and Unblock the Notifications








