శ్రీ లంకలో డ్యాష్ స్కూటర్‌ను పరిచయం చేసిన హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ స్వదేశీ పరిజ్ఞానంతో అంచెలంచెలుగా ఎదుగుతూ విదేశాలకు కూడా తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించింది . హీరో మోటోకార్ప్ దేశీయంగా జరిగిన 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద డ్యాష్ స్కూటర్‌ను ప్రదర్శించింది. దేశీయ విపణిలో ఉన్న మాయెస్ట్రో ఎడ్జ్‌ను శ్రీ లంకలో డ్యాష్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు.
హీరో మోటోకార్ప్ డ్యాష్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి

శ్రీలంక కోసం అందుబాటులోకి తెచ్చిన డ్యాష్ స్కూటర్ డ్యూయల్ టోన్ రంగుల్లో కలదు. ప్రస్తుతం ఉన్న రంగులు
- స్పోర్ట్స్ రెడ్
- టెక్నో బ్లూ
- వైబ్రెంట్ ఆరేంజ్ (విఎక్స్ వేరియంట్లో మాత్రమే లభించును)

డ్యాష్ స్కూటర్‌లోని ఎల్ఎక్స్ వేరియంట్ మాత్రమే సాలిడ్ పెయింట్ స్కీమ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

హీరో సంస్థ మాయెస్ట్రో ఎడ్జ్‌లో అందించిన 110.9సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌నే ఈ డ్యాష్ స్కూటర్‌లో కూడా అందించారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8.31 బిహెచ్‌పి పవర్ మరియు 8.30 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది.

దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి డ్యూయెట్ మరియు మాయెస్ట్రో ఎడ్జ్ (డ్యాష్) లను విడుదల చేశారు. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఈ రెండింటిని డిజైన్ చేసారు.

దేశీయ మార్కెట్లో హీరో మాయెస్ట్రో ఎడ్జ్ (డ్యాష్) ధర రూ. 50,551 ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది. శ్రీలంక మార్కెట్లో ఎల్ఎక్స్ ధర ఎల్‌కెఆర్ 2.26 లక్షలు, విఎక్స్ వేరియంట్ ధర ఎల్‌కెఆర్ 2.34 లక్షలు. (రెండు ధరలు హీరో మోటోకార్ప్ నుండి అందించినవే, ఎల్‌కెఆర్ అనగా శ్రీలంక కరెన్సీ)

హీరో మాయెస్ట్రో ఎడ్జ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ....


Click it and Unblock the Notifications








