హీరో నుండి మూడు కొత్త ఉత్పత్తులు

By Anil

ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలలో ఒకటయిన హీరోమోటోకార్ప్ తాజాగ ఒక టీసర్‌ను విడుదల చేసింది. అందులో మూడు కొత్త కమ్యూటర్ బైకులను విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, ఆ మూడు బైకులను మరియు వాటి వివరాలను వీడియో ద్వారా వెల్లడించింది.

హీరో మార్కెట్లోకి అందించిన డాన్ బైకును ఇప్పుడు మూడు కమ్యూటర్ మోడళ్లలో అందించనుంది. విభిన్న అవసరాలకు పెట్టింది పేరుగా ఉండే హీరో డాన్ బైకులో సాధారణమైన 100సీసీ సామర్థ్యం గల ఇంజన్ ఉండేది. ఇప్పుడు ఇదే డాన్‌ను మూడు కొత్త రూపాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి హీరోమోటోకార్ప్ సిద్దం అవుతోంది.

హీరో మోటోకార్ప్ డాన్

హీరోమోటోకార్ప్ విడుదల చేసిన వీడియో ప్రకారం అందులో మూడు బైకులను ప్రదర్శించింది. అవి వరుసగా డాన్ 100, డాన్ 125 మరియు 150 (100,125,150 లు వాటి ఇంజన్‌ యొక్క సామర్థ్యం)

హీరో మోటోకార్ప్ డాన్

మూడు డాన్ బైకుల డిజైన్‌తో తమ లైనప్‌లో ఉన్న డాన్ బైకుల కుటుంబం యొక్కడిజైన్ ఫిలాసఫీ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం పల్లె ప్రాంతాలతో పాటు సిటిలో కూడా మెప్పు పొందే విధంగా ఉన్న డిజైన్ లక్షణాలు.

హీరో మోటోకార్ప్ డాన్

హీరో కొత్తగా అభివృద్ది చేసిన వాటిలో డాన్ 100 బైకును గమనిస్తే, దీని ఇంజన్‌ను రీట్యూన్ చేశారు. సౌకర్యవంతమైన సీటు మరియు దీనికి చివరిలో పెద్ద క్యారియర్‌ను అందించారు. అంతే కాకుండా ఈ బైకులో అదనపు ఫుట్ రెస్ట్‌లు మరియు నూతన ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ను అందించారు.

హీరో మోటోకార్ప్ డాన్

డాన్ బైకులో ఫ్యామిలీలో ఉన్న డాన్ 125 గురించి ప్రస్తావిస్తే ఇందులో 125సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. 100సీసీ డాన్‌లో ఉన్న క్యారియర్ మరియు ఫుట్ రెస్ట్‌లతో పాటు ఆధునీకరించబడిన నూతన ఇంస్ట్రుమెంట్ కన్సోల్‌ కలదు. ఇది 100సీసీ బైకులో ఉన్న దానికన్నా చాలా విభిన్నంగా ఉంది.

హీరో మోటోకార్ప్ డాన్

హీరో పరిచయం చేసిన మూడింటిలో చివరిది డాన్ 150. ఇందులో 150సీసీ సామర్థ్యం గల ఎటిఎఫ్‌టి ఇంజన్‌ను అందించారు. ఇక ఇందులో కూడా సౌకర్యవంతమైన సీటు, ఫుట్ రెస్ట్, నూతన ఇంస్ట్రుమెంట్ కన్సోల్, టాకో మీటర్, ఫ్యూయల్ గేజ్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటివి కలవు.

హీరో మోటోకార్ప్ డాన్

హీరో మోటోకార్ప్ ఈ డాన్ శ్రేణి ఉత్పత్తులను ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసురానుంది.

హీరో మోటోకార్ప్ డాన్

ధర విషయానికి వస్తే ఈ మూడు ఉత్పత్తులు కూడా అత్యంత సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని విడుదల చేసే వరకు డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

హీరో మోటోకార్ప్ డాన్

  • ఇండియాలోని ఈ రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు జర భద్రం
  • బైకుల సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్న స్కూటర్లు అందుకు నిదర్శనం
  • పొట్ట మీద 100 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు పోనీచ్చుకున్నాడు

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2016, 10:35 [IST]
English summary
Hero MotoCorp Reveal Three New Dawn Motorcycles In A Video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+