హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ విడుదల: ప్రారంభ ధర రూ. 51,653 లు
హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి తమ ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ ఉత్పత్తిని విడుదల చేసింది. రూ. 51,653 లు ఎక్స్ షోరూమ్ (థానే)గా ఆశ్చర్యకరమైన ధరతో విపణిలోకి విడుదల చేసింది.

హీరో మోటోకార్ప్ ఐ3ఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని 2014 పరిచయం చేసింది. ఐ3ఎస్ అనగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ స్టాప్ అండ్ స్టార్ట్.

హీరో మోటోకార్ప్ ఈ ప్యాస్ ప్రొ ఐ3ఎస్ లో 100సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8.25బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ను వెనుక చక్రానికి సరఫరా చేయడానికి 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఇందులోని పరిచయం చేసిన ఐ3ఎస్ టెక్నాలజీ ద్వారా ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అండ్ స్టాప్ అవుతుంది,. తద్వారా అనవసరంగా మండే ఇంధనం ఆదా అవుతుంది. కాబట్టి మైలేజ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే దీని మైలేజ్‌కు సంభందించిన వివరాలు వెల్లడించలేదు.

హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ లో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులో ఐ3ఎస్ ను ప్రవేశపెట్టడం వలన వెనుక వైపున మరియు డీకాల్స్ మీద ఐ3ఎస్ బ్యాడ్జిని అందించారు.

ఈ బైకులో నీలం రంగులో ఒక బటన్ అందించారు. ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ మరియు ఆన్ అవడం ఇష్టం లేకపోతే ఆ బటన్‍ను వినియోగించి ఐ3ఎస్ పరిజ్ఞానాన్ని పనిచేయకుండా చేయవచ్చు.

- పాక్ ఉగ్ర మూకల అంతం కోసమేనా...?
- భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు


Click it and Unblock the Notifications








