హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 విడుదల: ప్రారంభ ధర రూ. 53,300 లు
భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, ఢిల్లీ నగరంలో తమ హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్110 బైకును విడుదల చేసింది. ఈ సరికొత్త కమ్యూటర్ బైకు ప్రారంభ ధర రూ. 53,300 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ప్రకటించారు.
హీరో మోటోకార్ప్ స్ల్పెండర్ ఐస్మార్ట్ 110 గురించి పూర్తి వివరాలు కోసం...

హీరో మోటోకార్ప్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఈ స్ల్పెండర్ ఐస్మార్ట్110 ను ప్రదర్శించారు.

రాజస్థాన్‌లో గల జైపూర్‌లోని హీరో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ది చేసారు.

దేశంలో ప్రముఖ నగరాలలో సరికొత్త ఐస్మార్ట్110 ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- ఢిల్లీ - ధర రూ. 53,300 లు
- హైదరాబాద్ - ధర రూ. 54,100 లు
- ముంబాయ్ - ధర రూ. 53,100 లు
- బెంగళూరు - ధర రూ. 53,800 లు
- చెన్నై - ధర రూ. 53,700 లు
- కలకత్తా - ధర రూ. 54,200 లు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.
- సిల్వర్ మరియు బ్లాక్
- రెడ్ మరియు బ్లాక్
- బ్లూ మరియు బ్లాక్
- స్పోర్ట్స్ రెడ్

సాంకేతిక వివరాలు
హీరోమోటోకార్ప్ ఈ నూతన స్ల్పెండర్ ఐస్మార్ట్110 లో 109.15సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

హీరోమోటోకార్ప్ ఈ నూతన స్ల్పెండర్ ఐస్మార్ట్110 లో 109.15సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 9.2బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరోమోటోకార్ప్ సంస్థ ఇందులో కూడా ఐ3ఎస్ సాంకేతికతను వినియోగించింది. తద్వారా మైలేజ్ విషయంలో ఇది వినియోగదారులకు సంతృప్తిని ఇస్తుంది.

డిజైన్ పరంగా దీనిని మొత్తం యువత కోసం రూపొందించినట్లుటుంది. బాడీ డీకాల్స్ మరియు ఫ్రంట్ హెడ్ లైట్ కొంచెం ప్రత్యేకమైన డిజైన్‌తో వచ్చాయి.

లభించు రంగులు
స్ల్పెండర్ ఐస్మార్ట్110 నాలుగు రకాల డ్యూయెల్ స్టోన్ రంగుల్లో
లభించును.

నూతన టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ప్లేట్ అనుసంధానం గల టెయిల్ ల్యాంప్ మరియు సరికొత్త గార్డ్ రెయిల్ కలదు.

సరికొత్త స్ల్పెండర్ ఐస్మార్ట్110లో చోటు చేసుకున్న మార్పుల్లో కొత్త ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ వచ్చింది. ఈ శ్రేణి బైకుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి మరియు అయితే భవిష్యత్తులో అన్ని బైకుల్లో కూడా ఇది తప్పనిసరి కానుంది.

2016 ఇండియన్ స్కౌట్ సిక్ట్సి దేశీయంగా విడుదల: ధర రూ. 11.99 లక్షలు
ఇండియన్ మార్కెట్లో ఉన్న ఐదు అత్యంత చౌక బైకులు


Click it and Unblock the Notifications








