చిత్తూరు హీరో ప్లాంట్ మీద మరో 3000 కోట్లు: వచ్చే నెలలో శకుస్థాపన చేయనున్న ఏపి సిఎం
స్వదేశీ టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ చిత్తూరు తయారీ ప్లాంట్ మీద దాదాపుగ 3000 కోట్లు రుపాయలు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి 18 లక్షల యూనిట్ల వాహనాల తయారీకి గాను ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గౌ,, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హీరో నూతన చిత్తూరు ప్లాంటుకు శంకుస్థాపన చేయనున్నారు.

హీరో కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరులోని తడ వద్ద చెన్నైకి దగ్గరగా ఉండే విధంగా సుమారుగా 600 ఎకరాలను కేటాయించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు హీరో మోటోకార్ప్ రెండూ ఒప్పందాలు చేసుకున్నాయి.
ప్రస్తుతం హీరో మోటోకార్ప్ సంస్థకు దేశ వ్యాప్తంగా మూడు తయారీ యూనిట్లు కలవు, అవి హర్యానాలోని గురుగ్రామ్, ధరుహెరా మరియు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో కలవు. వీటితో పాటు రాజస్థాన్‌లోని నీమ్రానా మరియు గుజరాత్‌లోని హలోల్ ప్రాంతాల్లో మరో రెండు యూనిట్లను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
మరిన్ని కథనాలు మీ కోసం....
ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు
అణు బాంబులకు సైతం చెదరని, బెదరని జెల్‌జవా భూగర్భ స్థావరం
ఇస్రో కొత్త కిరోసిన్ రాకెట్లతో మనుగడ కోల్పోనున్న అమెరికన్ రాకెట్ లాంచింగ్ సంస్థలు
ఇండియాకు చేరిన టాల్గో రైళ్లు: అతి త్వరలో పరీక్షలు


Click it and Unblock the Notifications








