2016 ఆటో ఎక్స్ పోలో 150సీసీ స్కూటర్‌ను ప్రదర్శించనున్న హోండా
దేశీయంగా స్కూటర్ల తయారీలోను మరియు అమ్మకాలలో హోండా అగ్రస్థానంలో కలదు. ప్రస్తుతం హోండా టూ వీలర్స్ సంస్థ దేశ వ్యాప్తంగా విసృత శ్రేణి స్కూటర్లు మరియు టూ వీలర్లను అందిస్తోంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తు ఉత్తమ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తోంది.
Also Read: భారత దేశపు నెం.1 స్కూటర్ ఆక్టివా 125 కు చావు దెబ్బ
హోండా టూ వీలర్స్ సంస్థ 2016 ఫిబ్రవరిలో జరగనున్న ఇండియన్ ఆటో ఎక్స్ పోలో సరికొత్త 150సీసీ స్కూటర్‌ను ప్రదర్శించనుంది. దీనిని హోండా పిసిఎక్స్ 150 అని సంభోదిస్తున్నారు.
హోండా పిసిఎక్స్ 150 ఫోటోలు...
హోండా సరికొత్త 150సీసీ స్కూటర్ పిసిఎక్స్ 150 ని నూతన సంవత్సరం సదర్భంగా ఈ ఏడాదిలో మార్కెట్లోకి అందివ్వనున్నారు. అయితే దీనిని 2014 లో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు.
Also Read: 3,499 లకే బజాజ్ వారి పల్సర్ ఆర్ఎస్200 ను ఇంటికి తీసుకెళ్లండి.
హోండా వారు అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ పిసిఎక్స్ 150 స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో వెస్పా అందుబాటులో ఉంచిన విఎక్స్ఎల్ 150 మరియు ఎస్ఎక్స్ఎల్ 150 స్కూటర్లకు ప్రత్యక్షంగా పోటిని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications

















