ఆరు నెలల నుండి భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూవీలర్ ఇదే..!!
భారత దేశపు ద్విచక్ర వాహనాల సెగ్మెంట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న వాహనం ఏదంటే ప్రతి ఒక్క భారతీయుడు టక్కున చెప్పే సమాధానం హోండా ఆక్టివా. అవునండీ, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారి హోండా ఆక్టివా స్కూటర్ 2016 ఏడాదిలో వరుసగా ప్రతి నెల కూడా బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.

ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే సుమారుగా 13,38,105 యూనిట్లు అమ్ముడుపోయాయి.

దీనికి పోటీగా ఉన్న మిగతా అన్ని స్కూటర్ల అమ్మకాలు సంఖ్య ఇదే సమయంలో 12,33,725 యూనిట్ల అమ్మకాలు జరిపాయి. మరియు అమ్మకాలలో 15 శాతం హోండా ఆక్టివా వాటా ఉంది.

మొదటి సారిగా హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా దేశీయ మార్కెట్లోకి మొదటి తరం ఆక్టివాను 2001 లో విడుదల చేశారు.

అప్పట్లోనే నెలకు సుమారుగా 55,000 యూనిట్ల వరకు అమ్మకాలు జరుపుతూ భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూవీలర్‌గా నిలుస్తూ వచ్చింది.

ప్రస్తుతం హోండా ఆక్టివా ఏడాది 2.46 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంటోంది.

ఇండియన్ స్కూటర్ల సెగ్మెంట్లోకి హోండా వారు ఆక్టివా పేరుతో ఆక్టివా ఐ, ఆక్టివా 3జి మరియు ఆక్టివా 125 అనే మూడు ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

జపాన్ ఆధారిత ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హోండా ఇండియన్ మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన డియో మరియు ఏవియేటర్ అనే స్కూటర్లను కూడా అందుబాటులో ఉంచింది.

హోండా ఆక్టివా శ్రేణిలో ఉన్న స్కూటర్లలో 124 సీసీ సామర్థ్యం ఉన్న 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇందులోని ఇంజన్ గరిష్టంగా 6,500ఆర్‌పిఎమ్ వద్ద 8.60బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 10.10ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది లీటర్‌కు 54 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. దీని ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 65,685 లుగా ఉంది.

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ హోండా ఆక్టివా నాలుగు విభిన్న రంగుల్లో లభించును. అవి,
బ్లాక్
రెబెల్ రెడ్ మెటాలిక్
మిడ్ నైట్ బ్లూ మెటాలిక్
పియర్ల్ అమేజింగ్ వైట్

ఫీచర్లు
- అనలాగ్ స్పీడో మీటర్
- ఫ్యూయల్ గేజ్
- ఎలక్ట్రిక్ స్టార్ట్
- లో ఫ్యూయల్ వార్నింగ్
- అల్లాయ్ వీల్స్
- ట్యూబ్ లెస్ టైర్లు
- ఆటోమేటక్ ట్రాన్స్‌మిషన్
- వీల్ బేస్: 1,260ఎమ్ఎమ్
- గ్రౌండ్ క్లియరెన్స్: 155ఎమ్ఎమ్
- సీటు ఎత్తు: 765ఎమ్ఎమ్
- పొడవు: 1,814ఎమ్ఎమ్
- వెడల్పు: 704 ఎమ్ఎమ్
- ఎత్తు: 1,151ఎమ్ఎమ్
- మొత్తం బరువు: 111కిలోలు
- ఇంధన ట్యాంకు సామర్థ్యం: 5 లీటర్లు
- హోండా నుండి మెట్రోపాలిటన్ రెట్రో స్కూటర్

కొలతలు



Click it and Unblock the Notifications