గ్రామీణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి: హోండా స్కూటర్స్
సిటి రైడింగ్ కోసం మాత్రమే అన్నట్లుగా పట్టణ యువత స్కూటర్లను విరివిగా ఎంచుకుంటోంది. అయితే ఈ ధోరణి మార్చడానికి హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా గ్రామీణ మార్కెట్లో తమ స్కూటర్ల ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే పండుగ సీజన్‌లో సరికొత్త వ్యూహంతో తమ స్కూటర్లతో గ్రామీణ మార్కెట్లోకి లోతుగా వెళ్లాలని చూస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్ల మీద ఉన్న డిమాండ్‌ను డబ్బు చేసుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలతో అధిక ఉత్పత్తి చేయనుంది. ఈ ఏడాది నుండి బారీ అమ్మకాలను ఆశిస్తూ సనంద్ ప్లాంటు నుండి ఉత్పత్తిని పెంచారు.

స్కూటర్ల మార్కెట్లో లీడర్ పొజిషన్‌లో హోండా గడిచిన మూడేళ్ల కాలంలో సుమారుగా 2,000 షోరూమ్‌లను ప్రారంభించింది.

ఇండియాలోని స్కూటర్ల అమ్మకాల వాటాలో హోండాదే మెజారిటీ. రానున్న పండుగ సీజన్ మరియు ఈ ఏడాది మొదటి పది నెలల మొత్తం అమ్మకాలును గత ఏడాదితో పోల్చుకుంటే 20 శాతం అధిక వృద్దిని సాధించాలని హోండా చూస్తోంది.

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ అధికారి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా మాట్లాడుతూ,గడిచిన రెండు మూడేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో స్కూటర్ల అమ్మకాలు పెరిగాయి తద్వారా ఈ పండుగ సీజన్ ముగిసే లోపు 20 శాతం అధిక అమ్మకాలను సాధిస్తామని చెప్పుకొచ్చాడు.

- విస్పోటనం సృష్టించిన ఆ కారును మళ్లీ విడుదల చేస్తామంటున్నారు
- డీజల్‌తో నడిచే బస్సుల్లో ఈ పరికరాన్ని అనుసంధానం చేస్తే 966 కిమీల మైలేజ్


Click it and Unblock the Notifications