మళ్లీ విడుదలైన హోండా సిబి హార్నెట్ 160ఆర్: ఈ సారైనా నిలబడేనా ?
జపాన్‌కు చెందిన హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం గత ఏడాది చివరిలో ఇండియన్ మార్కెట్లోకి సిబి హార్నెట్ 160ఆర్ బైకును విడుదల చేసింది. అయితే ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోయింది. కాని హోండా మళ్లీ దీనిని రెండు స్పెషల్ ఎడిషన్‌లుగా మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త రంగుల్లో, కొత్త ధరల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిబి హార్నెట్ 160ఆర్ ఈ సారైనా నిలబడుతుందో లేదో...
సరికొత్త హోండా సిబి హార్నెట్ 160ఆర్ స్పెషల్ ఎడిషన్‌ల గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో......

ధరలు
- సిబి హార్నెట్ 160ఆర్ బేస్ వేరియంట్ ధర రూ. 81,413 లు
- సిబి హార్నెట్ 160ఆర్ సిబిఎస్ ధర రూ. 85,912 లు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- సమర్థవంతమైన దాడి చేయగల ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు

లభించు రంగులు
రెండు స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు కూడా రెండు విభిన్నమైన మార్స్ ఆరేంజ్ మరియు స్ట్రైకింగ్ గ్రీన్ అనే రంగుల్లో లభించును.

ప్రత్యేకమైన బాడీ డీకాల్స్
ఈ రంగులకు అదనంగా బాడీ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో స్పెషల్ ఎడిషన్‌ను సూచించే విదంగా అందమైన స్టిక్కరింగ్‌తో బాడీ డీకాల్స్‌ను అందించారు.

సాంకేతిక వివరాలు
ఇంజన్ పరంగా ఈ రెండు స్పెషల్ ఎడిషన్ బైకుల్లో మునుపటి సిబి హార్నెట్ 160ఆర్‌లో అందించిన 162.71సీసీ సామర్థ్యం ఉన్న ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్, బిఎస్-IV ఇంజన్‌నే అందించారు.

పవర్ మరియు టార్క్
ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 15.6బిహెచ్ పవర్ మరియు 14.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును

ట్రాన్స్‌మిషన్
ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సరఫరా చేయడానికి ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

పోటీ
హోండా సిబి హార్నెట్ 160ఆర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా ఎఫ్‌జడ్-ఎస్, సుజుకి జిక్సర్ మరియు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవగలదు.



Click it and Unblock the Notifications








