సిడి 110 డ్రీమ్ డీలక్స్ బైకును విడుదల చేసిన హోండా : ధర రూ. 46,197 /-
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ బైకు విడుదల చేసింది. హోండా డ్రీమ్ డీలక్స్ పేరుతో విడుదల చేసిన ఈ సిడి110 బైకు ప్రారంభ ధర రూ. 46,197 లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా విడుదల చేశారు. హోండా సిడి110 డ్రీమ్ డీలక్స్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

ఇంజన్ వివరాలు
హోండా సిడి110 డ్రీమ్ డీలక్స్ బైకులో 110సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్
ఈ ఇంజన్ దాదాపుగా 8.25 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్ కలదు.

మైలేజ్
డ్రీమ్ డీలక్స్‌లోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా లీటర్‌కు 74 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

ఫీచర్లు
ఇందులో 179 ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్, పొడిగించి వీల్ బేస్ మరియు పొడవైన మరియు సౌకర్యవంతమైన సీటు కలదు .

మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ
ఇందులో ముందు మరియు వెనుకవైపున ట్యూబ్ లెస్ టైర్లు మరియు మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ కలదు .

సిడి 110 డ్రీమ్ డీలక్స్ బైకు అచ్చం డ్రీమ్ బైకును పోలి ఉంటుంది. అయితే ఇందులో అదనంగా ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు సరికొత్త గ్రాఫిక్ డిజైన్‌ను కలిగి ఉంది.

- పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
- భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు


Click it and Unblock the Notifications