2016 ఎడిషన్ డియో స్కూటర్‌ను విడుదల చేసిన హోండా
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి 2016 ఎడిషన్ డియో స్కూటర్‌ను విడుదల చేసింది. హోండా టూ వీలర్ల సంస్థ ఈ డియోను గత ఏడాది డియో స్కూటర్ ధరతో అందుబాటులోకి తెచ్చింది. 2016 డియో ప్రారంభ ధర రూ. 48,264 లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది, దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఈ 2016 ఎడిషన్ డియో స్కూటర్‌లో 109.2 సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.77 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్‌కు వి-మ్యాటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది గరిష్టంగా గంటకు 83 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

2016 ఎడిషన్ డియో స్కూటర్ ప్రస్తుతం అందుబటులో ఉన్న స్కూటర్లతో పాటు నూతన రంగులో అందుబాటులోకి వచ్చింది. నూతన కలర్ ఆప్షన్ పేరు మట్టీ ఆక్సిస్ గ్రే.

నూతన రంగుతో పాటు ఇది మిగిలిన మునుపటి జాజి బ్లూ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్, క్యాండీ పామ్ గ్రీన్ మరియు నలుపు.

2016 ఎడిషన్ హోండా డియో స్కూటర్ కొన్ని డిజైన్ మార్పులతో విడుదలైంది. అన్ని నూతన డియో స్కూటర్ల మీద ఇప్పుడు 3డీ చిహ్నాలు వస్తున్నాయి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ స్కూటర్ డియో యొక్క ఆరవ తరానికి చెందిన. మొదటి తరం డియో స్కూటర్‌ను 2002 లో పరిచయం చేశారు.

హోండా సంస్థ డియోలోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన డియో మోటో-స్కూటర్‌ను లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, శ్రీలంక మరియు నేపాల్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది.

బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు
రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీనిచ్చే కవాసకి ఎస్ట్రెల్లా ఇండియన్ మార్కెట్లోకి


Click it and Unblock the Notifications








