మొదటి యానివర్సరీ ఎడిషన్‌లో హోండా లివో
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తమ లివో 110 సీసీ బైకును అందుబాటులోకి తెచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో హోండా లివోను అందుబాటులోకి
తీసుకువచ్చారు.
హోండా లివో యానివర్సరీ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

హోండా ఈ లివో ను రెండు విభిన్న రంగుల్లో అందించింది. అవి, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు మట్టీ యాక్సిస్ గ్రే మెటాలిక్.

నూతన రంగుల మేళవింపుతో వచ్చిన లివో 110సీసీ మోటార్ సైకిల్స్ కాస్త స్పోర్టివ్ తత్వాన్ని కలిగి ఉంది.

విడుదల సమయం నుండి ఇప్పటి వరకు సుమారుగా ఏడాది కాలంలో 2,50,000 ల లివో బైకులు అమ్ముడుపోయాయి.

ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ విడుదల సందర్భంగా హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతూ, గడిచిన 12 మాసాల కాలంలో దీనికి పోటీగా వీచిన ఉత్పత్తులను ఎదుర్కొని మరీ మంచి అమ్మకాలను సాధించిందని తెలిపారు.

100 మరియు 110 సీసీ సెగ్మెంట్లో మంచి అమ్మకాలను సాధించిన లివో మొత్తం ఆరు రంగుల్లో లభిస్తోంది. అవి, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పియర్ల్ అమేజింగ్ వైట్, మట్టీ యాక్సిస్ గ్రే మెటాలిక్, సన్‌సెట్ బ్రౌన్ మెటాలిక్ మరియు బ్లాక్ వంటి రంగులు.

హోండా లివో సాంకేతిక వివరాలు
హోండా సంస్థ లివోలో 109.19సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది.

ఇందులోన శక్తివంతమైన ఇంజన్ 7,500ఆర్‌పిఎమ్ వద్ద 8.20బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 8.60ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్‌ను 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది.

హోండా లివో 110 బైకులో 8-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. ఇది లీటర్‌కు 63 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

గంటకు 86 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీసే ఇందులో డ్రమ్ బ్రేకులతో పాటు ఆప్షనల్‌గా ముందు వైపున డిస్క్ బ్రేకులను అందించారు.

హోండా లివో 110 ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 63,989 లుగా ఉంది.

2016లో ఉన్న ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులు
హోండా నుండి మెట్రోపాలిటన్ రెట్రో స్కూటర్


Click it and Unblock the Notifications








