హోండా నుండి మెట్రోపాలిటన్ రెట్రో స్కూటర్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ మెట్రోపాలిటన్ స్కూటర్ అనే వాహనానికి సంభందించి పేటెంట్ హక్కులను పొందిందని మార్కెట్లో కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇండియన్ మార్కెట్లోని స్కూటర్ల సెగ్మెంట్లో విడుదల కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా హోండా దేశీయ విపణిలో ఉన్న తమ స్కూటర్ల శ్రేణిని మరింత బలపరచనుంది.

డిజైన్ పరంగా హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియాకు చెందిన ఈ స్కూటర్ పూర్తిగా రెట్రో స్టైల్‌తో ఉంది.

అంతర్జాతీయంగా ఇందులో 50సీసీ సామర్థ్యం ఉన్న ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్ గల ఇంజన్ కలదు.

అయితే ఇండియన్ మార్కెట్లోకి పరిచయం కానున్న మెట్రోపాలిటన్ స్కూటర్‌లో ఆక్టివా స్కూటర్‌లో వినియోగించిన ఇంజన్‌ను అందించనున్నారు.

ప్రస్తుతం దేశీయంగా స్కూటర్ల అమ్మకాల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తున్న హోండా ఆక్టివా స్కూటర్‌లో 109.2సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.83ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హోండా టూ వీలర్ల సంస్థ ఇందులోని ఇంజన్‌కు వి-మ్యాటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. తద్వారా ఇది గంటకు 82 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులుపెడుతుంది.

హోండా టూ వీలర్ల సంస్థ ఈ మెట్రోపాలిటన్ స్కూటర్‌ను హోండా ఆక్టివా 125 కన్నా తక్కువ స్థానంలో ఉండేట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇది దేశీయ విపణిలోకి అమ్మకాలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే యమహా ఫాసినో మరియు సుజుకి యాక్సెస్ లకు పోటీగా నిలవనుంది. అంతే కాకుండా టీవీఎస్ జూపిటర్, సుజుకి మాయెస్ట్రో ఎడ్జ్ స్కూటర్లు మరియు ఒక విధంగా వెస్పా స్కూటర్లకు కూడా పోటీగా నిలవనుంది.

విమాన ప్రయాణంలో పైలట్లు మరియు ఎయిర్ హోస్టెస్ వద్దన్నా చేసే 20 చీకటి పనులు


Click it and Unblock the Notifications