ఊపందుకుంటున్న హోండా నవీ బుకింగ్స్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా వారు ఈ నెల మొదటి వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ నవీ క్రాసోవర్ స్కూటర్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తరువాత హోండా దీనికి చెందిన బుకింగ్స్‌ను ప్రారంభించింది. కేవలం రెండు వారాల సమయంలోనే 500 బుకింగ్స్ నమోదు అయ్యాయి. హోండా ప్రారంభించిన ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ ద్వారా ఇలా బుకింగ్స్ నమోదు అయ్యాయి.

హోండా వారు ఈ సరికొత్త నవీ క్రాసోవర్ స్కూటర్‌కు చెందిన బుకింగ్స్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. నవీ యొక్క ధర రూ. 39,500 అని ప్రకటించారు మరియు వీటిని ఈ ఏడాది ఏప్రిల్ నుండి డెలివరీ చేయనున్నారు.
Also Read: హోండా నవీ స్కూటర్‌కు చెందిన విడుదల వివరాల కోసం
హోండా టూవీలర్స్ కు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం అభివృద్ది చేసిన మొదటి స్కూటర్ ఈ నవీ
Also Read: ఇండియా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివాకు బ్రేకులు వేయనున్న హోండా నవీ
హోండా నవీ 109సీసీ కెపాసిటి గల 4-స్ట్రోక్ ఇంజన్‌ను కలిగి ఉంది . ఇది దాదాపుగా 7.83 బిహెచ్‌పి పవర్ మరియు 8.96 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.
హోండా నవీ విడుదల సమయంలోని ఫోటోలు:


Click it and Unblock the Notifications





























