ఏప్రిల్ నుండి హోండా నవీ డెలివరీ షురూ...!
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూ వీలర్ల మార్కెట్లోకి ఒక అత్భుతాన్ని తీసుకువచ్చింది. ఈ అత్భుతం గత నెలలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రతి ఒక్కరికీ తారస పడింది. అదేనండి హోండా వారి సరికొత్త నవీ స్కూటర్ గురించి చెబుతున్నాము. ప్రస్తుతం హోండా నవీ అత్భుతమైన బుకింగ్స్‌ను నమోదు చేసుకుంటోంది. అయితే బుక్ చేసుకున్న వారికి వచ్చే ఏప్రిల్ నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు నేడు ప్రకటించారు. హోండా నవీ స్కూటర్ ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

హోండా వినియోగదారుల కోసం నవీ బుకింగ్‌ల కొరకు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించారు. కాబట్టి వినియోగదారుల నవీ యాప్ ద్వారా మరియు సాధారణ హోండా డీలర్ షిప్‌వ వద్ద బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వచ్చే నెల నుండి ప్రతి డీలర్ వద్ద కూడా ఒక నవీ స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు. అంతే కాకుండా ఆసక్తి గల వారు వీటిని టెస్ట్ రైడ్ కూడా చేయవచ్చు.
Also Read: విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
హోండా ఈ సరికొత్త నవీ స్కూటర్‌లో 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 7.83 బిహెచ్‌పి పవర్ మరియు8.96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది విడుదల చేయు మొత్తం పవర్‌ను ఆటోమేటిక్ వి-మ్యాటిక్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రాలకు అందిస్తుంది. హోండా ఎకో టెక్నాలజీ గల ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 81 కిలోమీటర్లుగా ఉంది.
Also Read: భారతదేశపు సుదూర రైలు వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు
ప్రస్తుతం హోండా నవీ స్కూటర్ వివిధ రకాల కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇందులో ఆఫ్-రోడ్, స్ట్రీట్ మరియు అడ్వెంచర్ వంటి డ్రైవింగ్ మోడ్‌లను అందించారు. ప్రస్తుతం దీని ధర రూ. 39,500 లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications

























































