ఇండియన్ మార్కెట్లోకి హోండా నుండి అతి చవకైన 125సీసీ బైకు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ బైకుల అమ్మకాలలో రారాజుగా వెలుగొందుతున్న హీరో మోటోకార్ప్ వారి మోటార్ సైకిల్స్‌కు పోటీగా హోండా అతి తక్కువ ధరకు చవకైన 125సీసీ టిఎమ్‌ఎక్స్ బైకును విడుదల చేయనుంది.
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ వారి సమాచారం ప్రకారం ఇండియన్ మార్కెట్లో ఉన్న 125 సీసీ కెపాసిటి గల టూ వీలర్ల సెగ్మెంట్లోకి అతి చవకైన హోండా టిఎమ్‌ఎక్స్ 125 ను విడుదల చేయనుంది. హోండా టిఎమ్‌ఎక్స్ 125 బైకు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ బైకుల శ్రేణిలో హీరో మోటోకార్ప్ సంస్థ విజయకేతనం ఎగురవేస్తోంది. అయితే ఈ శ్రేణిలో మరింత వేడిని రేపడానికి హోండా సరికొత్త టిఎమ్‌ఎక్స్ 150 సీసీ టూ వీలర్‌ను తీసుకురానుంది.

దేశీయంగా ప్రాంతీయ మార్కెట్లో ఈ బడ్జెట్ బైకులకు ఎక్కువ గిరాకీ ఉంది. అయితే ప్రస్తుతం ప్రాంతీయ మార్కెట్లో బజాజ్ వారి సిటి100 బైకులు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. దీనికి పోటిగా ఈ టిఎమ్‍ఎక్స్150 ను తీసుకురానున్నట్లు తెలిపారు.

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఈ టిఎమ్ఎక్స్ 150 బైకును మార్కెట్లోకి విడుదల చేస్తే ధర రూ. 30,000 నుండి 35,000 ల మధ్య ఉండనుంది.

అతి తక్కువ ధరతో మార్కెట్లోకి రానున్న ఈ టిఎమ్‌ఎక్స్ 150 లో 124 సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఎంట్రీ లెవల్ కమ్యుటర్ సెగ్మెంట్లోకి విడుదల కానున్న ఈ టిఎమ్‌ఎక్స్ 150 లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలదు. అయితే పవర్ పరంగా దీనికి పోటిగా ఉన్న ఇతర బైకులతో సమానంగా విడుదల చేయగలదని సమాచారం.

ప్రస్తుతం హోండా ఈ టిఎమ్‌ఎక్స్ 150 బైకుకు దేశీయంగా పరీక్షలు నిర్వహించడానికి రెండు మోటార్ సైకిళ్లను తమ మాతృదేశం నుండి దిగుమతి చేసుకున్నట్లు హోండా తెలిపింది.

హోండా టూ వీలర్స్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 125సీసీ కెపాసిటి గల షైన్ బైకును మార్కెట్లో అందుబాటులో ఉంచింది. అతి త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ బైకుకు చెందిన మరింత సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

- హోండా నుండి సరికొత్త సిడి 110 డ్రీమ్ డీలక్స్: ధర రూ. 46,197
- ఇండియన్ మార్కెట్లోకి బెనెల్లీ కెఫెనెరో 150 : స్పై ఫోటోలు
- టైర్ల వలన జరిగే ప్రమాదాలను ఇలా నివారించండి


Click it and Unblock the Notifications