ఒక్క నెలలో 4,50,000 ల టూవీలర్లు: హోండా రికార్డ్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ గతంలో నెలకొల్పిన అన్ని రికార్డులను తనంతట తానుగా బ్రేక్ చేసింది. ప్రతి నెల అమ్మకాలను చూసుకుంటున్న హోండా గత జూలై 2016 గణాంకాలను చూసుకుని ఆశ్చర్యపోయింది. తమ రికార్డును తామే బ్రేక్ చేయడం ఇదే మొదటిసారి.

జపాన్‌కు చెందిన హోండా టూ వీలర్స్ సంస్థ గత నాలుగు నెలల కాలం నుండి అత్యధిక అమ్మకాలు సాధిస్తూ వస్తోంది. మరియు గడిచిన జూలై 2016 లో హోండా ఏకంగా 4.5 లక్షల అమ్మకాలను నమోదు చేసుకుంది.
Also Read: వివిధ రకాల కార్ల సంస్థలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ?
జూలై 2015 లో హోండా సుమారుగా 3,89,555 యూనిట్ల అమ్మకాలు జరపగా ఈ ఏడాది జూలైలో 4,53,844 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తం 17 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. ద్విచక్ర వాహన పరిశ్రమలో 9 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.
Also Read: టాటా టియాగో ఆ ఫీచర్‌తో వస్తే ప్రభంజనమే !!
మొత్తం మీద హోండా వారి ఆక్టివా అత్యధిక అమ్మకాలను సాధించింది. హోండా స్కూటర్స్ లైనప్ నుండి 3,09,144 యూనిట్లు అమ్ముడుపోయాయి, ఇందులో ఆక్టివా అమ్మకాలు 1,20,383 గా ఉన్నాయి. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఎగుమతుల పరంగా 33 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. గడిచిన జూలై 2016 లో 24,317 టూ వీలర్లను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసింది.


Click it and Unblock the Notifications