ఫస్ట్ యానివర్సరీ క్రెటాను విడుదల చేసిన హ్యుందాయ్
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ క్రెటా ఎస్‌యువి యొక్క మొదటి పుట్టిన రోజును జరుపుకుంది. క్రెటా విడుదలయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి యానివర్సరీ ఎడిషన్ క్రెటాను విడుదలకు సిద్దం చేసింది. దీనిని అతి త్వరలో డీలర్ల వద్ద అందుబాటులోకి తీసుకురానుంది.

సూరత్‌లోని హ్యుందాయ్ డీలర్ క్రెటా మొదటి వార్షికోత్సవ ఎడిషన్ క్రెటాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిసింది.

క్రెటా ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ పెట్రోల్ ధర రూ. 12,50,717 మరియు డీజల్ ధర రూ. 14,06,961 లు ఎక్స్ షోరూమ్ గా ఉన్నాయి.

దీనికంటే ముందు హ్యుందాయ్ ఈ మొదటి వార్షికోత్సవ ఎడిషన్ క్రెటాను బెంగళూరులో ప్రదర్శించారు. భారత దేశపు ప్రసిద్ద షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గెలుపొందినందుకు మొదటి వార్షికోత్సవ ఎడిషన్ క్రెటాను అందజేసారు.

ఈ మొదటి వార్షికోత్సవ ఎడిషన్ క్రెటాను ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఆధారంతో అభివృద్ది చేశారు. మరియు ఫీచర్ల పరంగా అన్ని క్రెటాలతో పోల్చితే ఇందులో విశిష్టమైన ఫీచర్లను అందించారు.

మొదటి యానివర్సరీ ఎడిషన్‌ను సూచించే విధంగా ప్రక్క వైపు డోర్ల మీద బ్లాక్ క్లాడింగ్‌కు పై వైపున ఎరుపు మరియు నలుపు రంగుల్లో ఉండే విధంగా గీతలను సృష్టించారు.

వెనుక వైపున మొదటి వార్షికోత్సవ ఎడిషన్ సూచించే విధంగా క్రెటా బ్యాడ్జిని అందించింది. ఇంటీరియర్ లోపల ఎరుపు మరియు నలుపు రంగుల్లో సీట్లను డిజైన్ చేసారు.

మొదటి వార్షికోత్సవ ఎడిషన్ క్రెటా ఎస్‌యువిలో ఏవిధమైన సాంకేతిక మార్పులు చోటు చేసుకోలేదు.

- సర్వం సిద్దం: స్కూటర్లలో కొత్త ట్రెండ్ సృష్టించడానికి సిద్దమైన ఆప్రిలియా
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఎఫ్-35 గురించి పూర్తి వివరాలు



Click it and Unblock the Notifications








