దేశీయ మార్కెట్లోకి స్ప్రింగ్‌ఫీల్డ్ బైకును విడుదల చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్స్
ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన బైకులను తయారు చేసే ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థ సరికొత్త 2016 స్ప్రింగ్‍ఫీల్డ్ క్రూయిజ్ బైకును విడుదల చేసింది. దీని ధర ఎంతో తెలుసా ? అక్షరాల ముప్పై లక్షల 60 రుపాయలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.
ఇంతటి ఖరీదైన బైకు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ప్రస్తుతం దీనికి సంభందించిన బుకింగ్స్‌ను అందుబాటులో ఉంచారు. బుక్ చేసుకున్న వారికి ఆగష్టు నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ 2016 స్ప్రింగ్‌ఫీల్డ్ బైకును ఇకానిక్ థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ ప్రేరణతో ఇండియన్ మోటార్‌సైకిల్స్ సంస్థ తయారు చేసింది.

ఇందులో శక్తివంతమైన 1,811 సీసీ కెపాసిటి గల వి-ట్విన్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 76 బిహెచ్‌పి పవర్ మరియు 138.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్ప్రింగ్ఫీల్డ్ బైకులోను ఇంజన్ విడుదల చేయు పవర్‌ను వెనుక చక్రానికి సరఫరా చేయడానికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు.

ఇండియన్ మోటార్‌సైకిల్స్ వారి స్ప్రింగ్‌ఫీల్డ్ బైకు బరువు సుమారుగా 421 కిలోల వరకు ఉంది.

భద్రత ఫీచర్లు
అమెరికా ఆధారిత సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్స్ తయారు చేసిన ఈ స్ప్రింగ్‌ఫీల్డ్ బైకులో
- యాంటి లాక్ బేకింగ్ సిస్టమ్
- టైర్ ప్రెసర్ మానిటరింగ్
- క్రూయిజ్ కంట్రోల్ వంటి భద్రత ఫీచర్లను అందించింది.
- కీ లెస్ ఎంట్రీ
- హై వే బార్
- స్క్రిప్ట్ ట్యాంక్ బ్యాడ్జి
- క్విక్ రిలీజ్ విండ్‌షీల్డ్
- మరియు శాడిల్ బ్యాగులో ఇందులో ఉన్నాయి.
- స్కౌట్
- ఛీఫ్ డార్క్ హౌస్
- ఛీఫ్ క్లాసిక్
- ఛీఫ్ వింటేజ్
- ఛీఫ్‌టెయిన్ మరియు రోడ్‌మాస్టర్

ఫీచర్లు

లభించు రంగులు
అమెరికా ఆధారిత క్రూయిజ్ తయారీదారులు ప్రస్తుతం ఈ 2016 స్ప్రింగ్‌ఫీల్డ్ బైకును రెండు రంగుల్లో అందిస్తోంది. అవి 1. థండర్ బ్లాక్, 2. ఇండిన్ రెడ్ పెయింట్ స్కీమ్

2016 స్ప్రింగ్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ప్రస్తుతం ఇండియన్ మోటార్‌సైకిల్ వారి ఛీఫ్‌టెయిన్ మరిటు ఛీఫ్ వింటేజ్ మోడళ్ల మధ్య ఉండనుంది.

ప్రస్తుతం ఇండియన్ మోటార్‌సైకిల్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లో క్రింది మోడళ్లను అందుబాటులో ఉంచింది.

ఇండియన్ మోటార్‌సైకిల్స్ 2016 స్ప్రింగ్‌ఫీల్డ్ బైకు

ఇండియన్ మోటార్‌సైకిల్స్ 2016 స్ప్రింగ్‌ఫీల్డ్ బైకు

ఇండియన్ మోటార్‌సైకిల్స్ 2016 స్ప్రింగ్‌ఫీల్డ్ బైకు

150సీసీ సెగ్మెంట్లో అధిక మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు
ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?
భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్...ఇవి ఎలా ఉంటాయి ?


Click it and Unblock the Notifications








