దేశీయ మార్కెట్లోకి అబ్బురపరిచే బైకు: ఇండియన్ రోడ్ మాస్టర్
ఇండియన్ మోటార్ సైకిల్స్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అందులో ఇండియన్ రోడ్‌మాస్టర్ ఒకటి. దీనిని భారత దేశపు భవిష్యత్తు డిజైన్‌గా పరిగణించవచ్చు.

ఇండియన్ రోడ్ మాస్టర్ ధర:
ఇండి్యన్ రోడ్ మాస్టర్ ధర రూ. 37 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది. దీనిని ఈ ఏడాది తొలిసగం తరువాత డెలివరీ ఇవ్వనున్నారు.
ఇండియన్ రోడ్‌మాస్టర్ ఇంజన్ వివరాలు:
ఇండియన్ రోడ్‌మాస్టర్ బైకులో 1811సీసీ కెపాసిటి గల రెండు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 138.9ఎన్ఎమ్ టార్క్‌ను 3000ఆర్‌పిఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానించారు.
లభించు రంగులు:
- ఎరుపు
- లోరి క్రీమ్ కాంబినేషన్‌లో గల ఎరుపు
- థండర్ బ్లాక్

ఇండియన్ రోడ్‌మాస్టర్ ఫీచర్లు:
- అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఫ్లోర్ బోర్డులు
- హీటెడ్ గ్రిప్స్ మరియు సీట్లు
- స్యాడిల్ బ్యాగ్ మరియు ట్రంక్ పెట్టెలను రిమోట్ ద్వారా కంట్రోల్ చేయడం
- కీలెస్ స్టార్ట్
- లెథర్ సీట్లు
- 200డబ్ల్యూ స్టీరియో సిస్టమ్
- బ్లూటూత్ మరియు స్మార్ట్ వ్యవస్థ
- యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్
- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
- క్రూయిజ్ కంట్రోల్
- 142 లీటర్ల స్టోరేజ్ స్పేస్
- ఇంధన ట్యాంకు సామర్థ్యం
- బరువు: 403 కిలోలు


Click it and Unblock the Notifications


























