ఇక మీదట రెండు హెల్మెట్లు ఉంటేనే టూ వీలర్ రిజిస్ట్రేషన్
బెంగళూరు లేదా కర్నాటకలో ఎక్కడైనా టూ వీలర్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే మీ వద్ద రెండు ఐఎస్‌ఐఎస్ గుర్తుంపు పొందిన రెండు హెల్మెట్లు ఉన్నాయని నిరూపించుకోవాలి. లేదంటే మీ బైకు రిజిస్ట్రేషన్ కష్టమే.

జనవరి నుండి ద్విచక్ర వాహనం మీద ఇద్దరు ప్రయాణిస్తున్నట్లయితే ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం ప్రస్తుతం ఉన్న రూల్స్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు దావణగెరిలోని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read: ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల 8 డీజల్ కార్లు
ద్విచక్ర వాహనం ద్వారా జరిగే ప్రమాదాలలో ఎక్కువగా హల్మెట్ లేకపోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిసింది. అందుకోసం బైకును నడుపుతున్న వ్యక్తి మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెంట్ ధరించాలని రూల్ వచ్చింది. అయితే దీనిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు హెల్మెట్లు ఉంటే రిజిస్ట్రేషన్ సాధ్యం అవుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications








