దేశీయంగా అందుబాటులో ఉన్న ఇఆర్-ఎన్6 మీద ఆఫర్ ప్రకటించిన కవాసకి
కవాసకి ఇండియన్ మార్కెట్లోకి అందించిన ఇఆర్-6ఎన్ బైకు మీద అతిశయమైన ఆఫర్‌ను ప్రకటించింది. కవాసకి 650 నిన్జా 650 టూరింగ్ యొక్క నేక్డ్ వెర్షన్‌ను ఇఆర్-6ఎన్‌గా అందిస్తోంది. దీని అసలు ధర రూ. 5.37 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉంది. ప్రస్తుతం దీని మీద 25,000 ల వరకు ఆఫర్ ప్రకటించింది.

ఉన్నట్లుండి ప్రకటించిన ఆఫర్లకు కారణం ప్రస్తుతం అమ్మకాలు తక్కువగా నమోదు చేసుకుని ఆశించని స్థాయిలో అమ్మకాలు సాధించకపోవడం వలన డీలర్ల వద్ద ఉన్న స్టాకును క్లియర్ చేయడానికి అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందిని తెలిపారు.
ఇండియన్ ఇస్రో గురించి నిర్ఘాంతపోయే నిజాలు...!!
కవాసకి ఇఆర్-6ఎన్ బైకులో 649 సీసీ కెపాసిటి గల సమాతరంగా ఉన్న రెండు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 71.21 బిహెచ్‌పి పవర్ మరియు 63.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం ఈ బైకులో ఉన్న ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. అయితే కవాసకి మోటార్స్ ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కల్పించలేకపోయింది.
17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ
ఇఆర్-6ఎన్ బైకు మీద ధరలను తగ్గించిన కవాసకి స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేస్తుందనే అంచనాతో ఉంది. అయితే స్టాక్ పూర్తిగా అమ్ముడుపోయిన తరువాత కూడా ఈ ఇఆర్-6ఎన్ బైకుసను తిరిగి మార్కెట్లోకి ఉత్పత్తి చేయనుంది. అంతేకాకుండా త్వరలో మంచి ఉత్పత్తులను కవాసకి ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications


