రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీనిచ్చే కవాసకి ఎస్ట్రెల్లా ఇండియన్ మార్కెట్లోకి
కవాసకి మోటార్స్ ఇండియా సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ఎస్ట్రెల్లా మోటార్ సైకిల్‌ను దిగుమతి చేసుకుంది. దేశీయంగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ వారి మోటార్ సైకిళ్లను పోలి ఉండే ఈ బైకు ఖచ్చితంగా ఎన్ఫీల్డ్ వారి ఉత్పత్తులకు పోటిని ఇవ్వనుంది.ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం దీనిని కవాసకి సంస్థ ప్రయోగ మరియు అభివృద్ది పనుల నిమిత్తం దీనిని దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది.

కవాసకి ఎస్ట్రెల్లా బైకులో 249 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 17.16 బిహెచ్‌పి పవర్ మరియు 18 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.
Also Read: అత్యంత దూరాలకు ప్రయాణికులను చేరవేస్తున్న టాప్-10 ప్యాసింజర్ రైళ్లు
ముందు మరియు వెనుక రెండు వైపుల కూడా ఇందులో సరైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం డిస్క్ బ్రేకులను అందించారు. అలాగే ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సాధారణ కాయిల్ స్ప్రింగ్ షాక్ అబ్జార్వర్లను అందించారు. కవాసకి ఎస్ట్రెల్లా డిజైన్ మొత్తం రాయల్ ఎన్ఫీల్ బైకులను పోటిగా నిలిచే రీతిలో ఉంది.
Also Read: అణు పరీక్షలు ఆపకపోతే మేమేంటో చూపిస్తాం...!!
కవాసకి సంస్థ ఈ బైకు చెందిన అన్ని పరీక్షలు పూర్తయితే దీనిని దేశీయంగా చకన్‌లో ఉన్న బజాజ్ ఆటో వారి ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు. ఇండియన్ మార్కెట్లో ఉన్న 250 నుండి 300 సీసీ సెగ్మెంట్లోకి బైకులను అందించే పథకం వేస్తోంది ఈ జపాన్‌కు చెందిన సంస్థ.



Click it and Unblock the Notifications








