నాలుగు కొత్త బైకులను విడుదల చేయనున్న కవాసకి
కవాసకి మోటార్స్ ఇండిన్ మార్కెట్లోకి నాలుగు కొత్త బైకులను 2017 నాటికి విడుదల చేయనుంది. వచ్చే ఏడాదిలో విడుదలయ్యే కొత్త బైకులు నింజా 650, జడ్650, జడ్900 మరియు డబ్ల్యూ800 లుగా ఉన్నాయి.
జపాన్‌కు చెందిన కవాసకి ఇండియన్ మార్కెట్లోకి వచ్చే 2017 లో సుమారుగా నాలుగు ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ రకాల వాహన ప్రదర్శన వేదికల మీద ఈ నాలుగింటిని ప్రదర్శిస్తూ వచ్చింది.

కవాసకి మోటార్స్ 2017 నుండి ఒక్కొక్కటి చెప్పున విడుదల చేయనున్న నాలుగు బైకులు ఇవే...
- కవాసకి నింజా 650,
- కవాసకి జడ్650,
- కవాసకి జడ్900 మరియు
- కవాసకి డబ్ల్యూ800
- ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్ పోర్ట్ రన్ వేలు
- మారుతి నుండి మరో శుభవార్త
- వీటి విడుదల మార్కెట్లో మరో శకానికి నాంది...!!

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న నింజా 650, ఇఆర్-6ఎన్, మరియు జడ్800 వంటి మోడళ్ల స్థానాన్ని నింజా 650, జడ్650 మరియు జడ్900 మోడళ్లు భర్తీ చేయనున్నాయి.

గతంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం కవాసకి తమ సరికొత్త డబ్ల్యూ800 క్లాసిక్ బైకును ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కవాసకి డీలర్ల వద్ద ప్రదర్శనకు ఉంచారు. కస్టమర్ల నుండి వీటికి లభించే స్పందన ఆధారంగా భవిష్యత్తులో వీటి ఆధారిత బైకులను మరిన్ని సంఖ్యలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కవాసకి తెలిపింది.

కవాసకి ఈ నాలుగు బైకులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం వీటి శ్రేణిలో ఉన్న మిగతా మోడళ్లకు గట్టి పోటీనివ్వనున్నాయి. మరియు నూతన సొబగులతో విడుదల కానున్న నింజా 650, జడ్650 మరియు జడ్900 మోడళ్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ట్రయంప్ లైనప్‌లో ఉన్న స్ట్రీట్ ట్విన్ మరియు హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోడళ్ల ధరకు దగ్గరగా విడుదలయ్యే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








