చూడటానికి సైకిళ్లలా ఉన్నా ధరలు మాత్రం లక్షల్లో

కవాసకి మోటార్ సైకిల్స్ దేశీయ విపణిలోకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్ అనే రెండు బైకులను విడుదల చేసింది. చూడటానికి సైకిళ్ల రూపంలో ఉన్నా వీటి ధరలు మాత్రం లక్షల్లో ఉన్నాయి.

By Anil

సుమారుగా రెండేళ్ల పాటు తటస్థంగా ఉన్న కవాసకి ఎట్టకేలకు తమ ఇండియాన్ లైనప్‌లోకి రెండు బైకులను విడుదల చేసింది. రెండు రేస్-రెడీ ఆఫ్ రోడింగ్ బైకులను విడుదల చేసింది. కెఎక్స్100 (KX100) మరియు కెఎక్స్250ఎఫ్ (KX250F) అనే ఈ రెండు బైకులను కేవలం కవాసకి డీలర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉంచనుంది.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

కవాసకి లైనప్‌లోని ఆఫ్ రోడింగ్ శ్రేణిలో గల కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్ మోడళ్లు ఆఫ్ రోడింగ్ బైకుల సెగ్మెంట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకోసం కవాసకి వాటిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

ఆఫ్ రోడింగ్ కోసం మంచి బైకులే అయినప్పటికీ వీటి ధరలు మాత్రం ఆకాశానంటుతున్నాయి. కెఎక్స్100 ధర రూ. 4.68 లక్షలు మరియు కెఎక్స్250ఎఫ్ ధర రూ. 7.14 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

ధరఎక్కువా ? ఇవి కేవలం ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే, అంటే వీటికి రహదారి రిజిస్ట్రేషన్ ఉండదన్నమాట. కాబట్టి వీటి దిగుమతి మరియు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులను కలుపుకుంటే వీటి ధరలు మరింత పెరగనున్నాయి.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

ఈ రెండు మోడళ్లకు దేశీయంగా రిజిస్ట్రేషన్ ఫీజులను కలుపుకుంటే అమెరికాలో లభ్యమయ్యే కెఎక్స్250ఎఫ్ బైకు ధర 26.5 శాతం అదే విధంగా కెఎక్స్100 బైకు ధర అమెరికా మార్కెట్‌తో పోల్చుకుంటే ఇండియాలో 50 శాతం ఎక్కువగా ఉంది.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

కవాసకి మోటార్ సైకిల్స్ లైనప్‌లో ఉన్న చిన్న బైకుల కన్నా కొలతల పరంగా ఇది పెద్దగా ఉంటుంది. కవాసకి ఇందులో 999సీసీ సామర్థ్యం గల ఇంజన్ అందించింది. మరియు అత్యుత్తమ ఇంజన్ పర్ఫామెన్స్ కోసం కవాసకి పవర్ వాల్వ్ సిస్టమ్ (KIPS) ను కూడా ఇందులో పరిచయం చేసింది.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

కవాసకి కెఎక్స్100 ముందు భాగంలో 36ఎమ్ఎమ్ పొడవు వరకు అడ్జెస్ట్ చేసుకున్న అవకాశం ఉన్న 275ఎమ్ఎమ్ సస్పెన్షన్ ట్రావెల్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున ప్రిలోడ్ అడ్జెస్టర్‌తో 275ఎమ్ఎమ్ ట్రావెల్ గల యుని-ట్రాక్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

దీనిని పూర్తిగా యువతను ఉద్దేశించి అభివృద్ది చేసింది కవాసకి. అందుకోసం ఈ మోటార్ సైకిల్ బరువు కేవలం 77 కిలోలు ఉండేట్లు నిర్మించింది.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

కెఎక్స్250ఎఫ్ దీని సెగ్మెంట్లో అత్యంత విజయవంతమైన ఉత్పత్తి అని చెప్పవచ్చు. ఇందులో 249సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

కవాసకి ఈ కెఎక్స్250ఎఫ్ బైకును అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్ ద్వారా నిర్మించింది. కవాసకి వెర్సేస్ 650 మోడల్‌లో గల ఎస్ఎఫ్ఎఫ్ పోర్క్‌ను ముందు వైపున స్టాండర్డ్‌గా అందించింది.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

ఇక వెనుక వైపున కవాసకి యుని-ట్రాక్ లింకేజ్ సిస్టమ్ గల మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

కవాసకి కెఎక్స్100 మరియు కెఎక్స్250ఎఫ్

  • 2017 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల: ప్రారంభ ధర రూ. 49.10 లక్షలు
  • 2017 మారుతి స్విఫ్ట్ బ్రోచర్ లీక్: ఇండియన్ వేరియంట్ల వివరాలు
  • సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు

More from DriveSpark

Article Published On: Tuesday, December 20, 2016, 19:35 [IST]
English summary
Kawasaki Launches Two Dirt Bikes In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+