నిశ్శబ్దంగా నింజా 1000 బైకును అభివృద్ది చేస్తున్న కవాసకి
కనాసకి మోటార్స్ సంస్థ అత్యంత రహస్యంగా నింజా 1000 మోడల్ బైకును అభివృద్ది చేస్తోంది. కవాసకి దీనికి సంభందించిన పేంటెంట్‌ను కూడా పొందింది. నింజా 1000 బైకు యొక్క పేటెంట్ ఫోటోలు మరియు సమచారాన్ని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

సరికొత్త నింజా 1000 బైకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ టూరింగ్ సెగ్మెంట్లోకి ఎంటర్ కానుంది.

తాజాగా డుకాటి మోటార్స్ సంస్థ వరల్డ్ డుకాటి వీక్ లో తమ సరికొత్త సూపర్‌స్పోర్ట్ 939 బైకును ప్రదర్శించారు. కవాసకి వారి నింజా 1000 బైకు ఈ డుకాటి సూపర్‌స్పోర్ట్ 939కు గట్టి పోటీగా నిలవనుంది.

నింజా 1000 కు సంభందించిన విడుదలైన ఫోటోలను పరిశీలిస్తే దీనిని పూర్తి స్థాయిలో స్పోర్టివ్ మరియు ఏరోడైనమిక్ బాడీతో రూపొందించారు.

పొడవైన హ్యాండిల్ రైడింగ్ సౌలభ్యం కలదు, నింజా హెచ్2 మరియు హెచ్2ఆర్ వంటి మోడళ్లకు ఆనవాళ్లను ఇందులో గమనించవచ్చు.

కవాసకి తమ నింజా 1000 కు సంభందించిన ఏ విధమైన సాంకేతిక వివరాలు విడుదల కాకుండా రహస్యంగా ఉండేందుకు అత్యంత రహస్యంగా నింజా 1000 ను రూపొందిస్తున్నారు.

కవాసకి ఇంజనీర్లు దీనిని యురో 4 కాలుష్య నియమాలను పాటించే విధంగా అభివృద్ది చేస్తున్నారు.

- ఆధిపత్యం కోసం పోరాటం


Click it and Unblock the Notifications