అప్‌డేటెడ్ మోడల్స్‌గా నింజా650 మరియు ఇఆర్-6ఎన్
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ కవాసకి ఇండియన్ మార్కెట్లోకి అందించిన నింజా650 మరియు ఇఆర్-6ఎన్ బైకులకు స్వల్ప మార్పులు చేసి మరలా అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని పూర్తి స్థాయిలో అప్‌డేట్ చేసిన తరువాత దేశవ్యాప్తంగా వెంటనే అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
అప్‌డేటెడ్ నింజా650 మరియు ఇఆర్-6ఎన్ ల గురించి......

అప్‌డేటెడ్ నింజా650 మరియు ఇఆర్-6ఎన్ ల గురించి మరిన్ని వివరాలు తర్వాత స్లైడర్లలో....

స్పోర్ట్స్ బైకులకు టైర్లు ఎంతో కీలకమైనవి, అందుకోసం ఇండియన్ కవాసకి సంస్థ తమ ఇఆర్-6ఎన్ బైకులో డన్‌లప్ స్పోర్ట్‌మ్యాక్స్ డి214 టైర్లను అందించారు.

మరొక మోడల్ నింజా 650 బైకులో డన్‌లప్‌కు చెందిన రోడ్‌స్మార్ట్ II టైర్లను యథావిధిగా వినియోగించనున్నారు.

నింజా 650 బైకు సరికొత్త కవాసకి గ్రీన్, బ్లాక్ మరియు సిల్వర్ రంగుల్లో లభించనుంది.

నింజా 650 బాడీ డీకాల్స్ మీద దీని అందాన్ని పెంచే విధంగా కొన్ని స్టిక్కర్లను అంటించనున్నారు. ఇక కవాసకి ఇఆర్-6ఎన్‌లో బ్లాక్ పెయింట్ స్కీమ్ మీద కవాసకి గ్రీన్ పేరుతో మెరవనుంది.

రెండు బైకుల్లో కూడా అదే 649సీసీ సామర్థ్యం ఉన్న రెండు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కొనసాగించున్నారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 70 బిహెచ్‌పి పవర్ మరియు 64ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు. అయితే కవాసకి ఇంత వరకు తమ ఈ రెండు ఉత్పత్తుల్లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కనీసం ఆప్షనల్‌గా కూడా అందివ్వలేకపోతోంది.

ఇవి మినహాయించి కవాసకి నింజా 650 మరియు ఇఆర్-6ఎన్‌లలో ఏ విధమైన మార్పులు చోటుచేసుకోలేదు.

ఎస్‍యులకు ఫిదా అయిపోయిన ఇండియన్స్
2016 మొదటి త్రైమాసికంలో అదరగొట్టిన బైకులు ఇవే

Click it and Unblock the Notifications