ఇండియా విడుదలకు సిద్దమవుతున్న కవాసకి డబ్ల్యూ800 క్లాసిక్

కవాసకి టూ వీలర్స్‌కు చెందిన డబ్ల్యూ800 అనే మోడ్రన్ క్లాసిక్ బైకు దేశీయ మార్కెట్లోకి 2017 ప్రారంభానికి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

By Anil

ఇండియన్ మార్కెట్లోకి కొన్ని మోటార్ సైకిళ్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది కవాసకి. జపాన్ ఆధారిత ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసకి దేశీయంగా సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తోంది. అందులో కవాసకికు చెందిన డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్ బైకును వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్

ప్రస్తుతం దేశీయంగా ఉన్న కొన్ని ఎంచుకోదగ్గ విక్రయ కేంద్రాలలో ఈ డబ్ల్యూ800 బైకును ప్రదర్శనకు ఉంచింది. డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్ బైకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్

కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌ (CBU)గా అందుబాటులోకి రానున్న ఈ డబ్ల్యూ8000 క్లాసిక్ బైకును సరైన ధరతో మార్కెట్లోకి విడుదల చేస్తే దీనికి పోటీగా ఉన్న ఉత్పత్తుల అమ్మకాలకు అంతరాయం కలగడం తద్యం. (ధరకు సంభందించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు).

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్

సాంకేతికంగా కవాసకి డబ్ల్యూ800 బైకులో 773సీసీ సామర్థ్యం గల వర్టికల్ ట్విన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 46.4బిహెచ్‌పి పవర్ మరియు 60ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేయగల పవర్ మరియు టార్క్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది. ముందు మరియు వెనుక చక్రాలు యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేనటువంటి డిస్క్ బ్రేకులను పొందాయి.

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్

కవాసకి ఈ డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్ బైకును దేశీయ విపణిలోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రియంప్ బొన్నెవిల్లే స్ట్రీట్ ట్విన్ మరియు డుకాటి స్క్రాంబ్లర్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవనుంది.

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్ బైకు మార్కెట్లోకి విడుదల అయితే ప్రారంభ ధర రూ. 10 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం కలదు.

కవాసకి డబ్ల్యూ800 మోడ్రన్ క్లాసిక్
  • ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ మద్య మరో SUVని ప్రవేశపెట్టనున్న ఫోర్డ్
  • ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ తో విడుదలైన యమహా వైజడ్ఎఫ్-ఆర్15
  • రెనో ఇండియా డిసెంబర్ ఆఫర్లు: లక్ష రుపాయల వరకు ప్రయోజనాలు

More from DriveSpark

Article Published On: Monday, December 5, 2016, 10:39 [IST]
English summary
Kawasaki W800 Modern Classic, India Launch By Early 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+