కవాసకి లిమిటెడ్ ఎడిషన్ కేవలం పది యూనిట్లు మాత్రమే
కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 2016 పండుగ సీజన్ కోసం జపాన్‌కు చెందిన ఈ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ దేశీయంగా తమ జడ్800 మోడల్ బైకును లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులో ఉంచింది.

కవాసకి లిమిటెడ్ ఎడిషన్ జడ్800 ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.50 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఇది స్టాండర్డ్ వేరియంట్ కన్నా 15,000 రుపాయలు ఎక్కువగానే ఉంది.

లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైన కవాసకి జడ్800 ను కేవలం 10 యూనిట్లను మాత్రమే దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచారు.

లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీట్ ఫైటర్ బ్లాక్ మరియు బ్లూ పెయింట్ జాబ్‌లతో పాటు, అక్కడక్కడ ఎరుపు మరియు తెలుపు రంగుల మేళవింపుతో బాడీ ప్యానల్స్ మరియు హెడ్ లైట్లను ఆకర్షణీయంగా డిజైన్ చేసారు.

సాంకేతికంగా కవాసకి జడ్800 మోడల్ లిమిటెడ్ ఎడిషన్ బైకులో 806సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

జడ్800లోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 111బిహెచ్‌పి పవర్ మరియు 83ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 6-గేర్‌బాక్స్‌ను అనుసందానం చేశారు.

ప్రస్తుతం అచ్చం ఇలాంటి మోడల్ మలేషియా మరియు ఇతర ఆసియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇంతకు మునుపు దేశీయ విపణిలో ఈ జడ్800 బ్లాక్ మరియు గ్రీన్ పెయింటింగ్ సమ్మేళనంతో అమ్మకాల్లో ఉంది.

- క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు
- భారీ విజయంతో దూసుకెళ్తున్న రెనో క్విడ్
- ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న నిస్సాన్


Click it and Unblock the Notifications








