కెటిఎమ్ నుండి రానున్న రెండు కొత్త ఉత్పత్తులు ఇవే
మిలాన్‍లో జరిగే ఎకిమా మోటార్ సైకిల్ ప్రదర్శనలో ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. సరికొత్త డ్యూక్ 390 మరియు 200 ఉత్పత్తులను ఈ వేదిక మీద ప్రదర్శించనుంది.
ఆస్ట్రియన్‌కు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కెటిఎమ్ రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. త్వరలో జరగనున్న మిలాన్ ఎకిమా మోటార్ సైకిల్ ప్రదర్శనలో కెటిఎమ్ వారి అప్ కమింగ్ 2017 డ్యూక్ ఉత్పత్తులను ప్రదర్శించనుంది.

వీటికి సంభందించిన విడుదలైన టీజర్ ద్వారా కెటిఎమ్ డ్యూక్ 390 బైక్ ఆవిష్కరణలో ఒక మనిషి షిప్ యార్డ్ ముందు నిల్చున్నాడు, డ్యూక్ సామ్రాజ్యం యొక్క ప్రభావాన్ని తెలియజేసేలా ఉంది ఈ టీజర్.

2017 డ్యూక్ 390 బైకు ఇండియన్ లైనప్‌లోకి చేరనుంది మరియు మిలాన్ మోటార్ షో వేదిక మీద డ్యూక్ 200 ని రెండవ రోజు ప్రదర్శించనుంది.

కెటిఎమ్ డ్యూక్ 390, 200 లతో పాటు 800సీసీ సామర్థ్యం రెండు సమాంతర సిలిండర్లు గల ఇంజన్‌ను కెటిఎమ్ తమ శ్రేణిలోకి ప్రవేశపెట్టనుంది. ఇది ముఖ్యంగా డ్యూక్ 690 సింగల్ సిలిండర్ మ్యానిక్ ఇంజన్ గల వేరియంట్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

అంతే కాకుండా మిలాన్ మోటార్ షో వేదికగా డ్యూక్ 800సీసీ ఆధారిత నిర్మాణ శైలిలో డ్యూక్ 125 ను ప్రదర్శించే అవకాశం ఉంది. మరియు దేశీయ మార్కెట్లోకి కూడా దీనిని ప్రయోగించనుంది కెటిఎమ్.

కెటిఎమ్ ప్రదర్శించనున్న మొత్తం ఉత్పత్తులను చూడాలనుకుంటే నవంబర్ 8 న మాతో కలిసి ఉండండి. కెటిఎమ్ ఎకిమా మోటార్ షోలో ప్రదర్శించే అన్ని ఉత్పత్తుల గురించిన ప్రత్యేక కథనం కోసం....
కెటిఎమ్ డ్యూక్ 390 టీజర్

- మహీంద్రా నుండి సరికొత్త అర్మాడా ఎమ్‌యువి
- భవిష్యత్ ప్రయాణం ఇలా ఉంటుందంటే నమ్మగలరా...?
- 8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20


Click it and Unblock the Notifications








