కేవలం 3.2 కిమీలు నడిచిన అత్యంత అరుదైన సి-01 బైక్ వేలానికి
లోటస్ అనే ఇంజనీరింగ్ బృందం 2014 లో మొదటి సారిగా సి-01 అనే బైకులను ప్రదర్శించారు. తరువాత కేవలం 100 సి-01 బైకులను మాత్రమే ఉత్పత్తి చేశారు. అయితే అన్నింటిని అమ్మేశారు. లోటస్ వారి ఉత్పత్తులు ఎప్పటకప్పుడు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ ఉత్పత్తులను లిమిటెడ్ ఎడిషన్‌గా అందిస్తు వచ్చారు.

లోటస్ వారి సి-01 బైకును సొంతం చేసుకున్న వ్యక్తి ఒకరు ఈ అరుదైన బైకుకు వేలం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.

దీనిని అమెరికాలోని కాలిఫోర్నియాలో గల మెంటెరీ లోని మెకమ్ వేలం పాటలో వేలం నిర్వహించనున్నాడు.

కొత్త సి-01 మోటార్ సైకిల్ కొనుగోలు చేయలేకపోయిన వారికి ఇది అద్భుతమైన అవకాశం అని అతను తెలిపాడు. అయితే వేలం మొత్తాన్ని వెచ్చించి పోటీ పడి మరీ దీనిని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

లోటస్ సంస్థ దీనిని విడుదల చేసినప్పటి ధర ఇండియన్ రుపాయల్లో సుమారుగా 70 లక్షలు వరకు ఉన్నట్లు తెలిసింది.

ఈ వేలం నిర్వహణలో దీనిని సుమారుగా 2.5 కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు వేలం నిర్వాహకులు తెలిపారు.

అతి త్వరలో వేలానికి అందుబాటులోకి రానున్న ఈ లోటస్ సి-01 బైకు కేవలం 3.2 కిలోమీటర్లు దూరం మాత్రమే నడిచింది.

లోటస్ సి-01 బైకులో సుమారుగా 1,195 సీసీ సామర్థ్యం ఉన్న వి ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇందులో వినియోగించిన ఇంజన్‌ను కెటిఎమ్ సంస్థకు చెందిన ఆర్‌సి8ఆర్ బైకులో వినియోగించిన ఇంజన్ అని తెలిసింది.

లోటస్ ఇంజనీరింగ్ బృందం ఈ ఇంజన్‌కు స్వల్ప మార్పులు చేసి మరియు 181 కిలోల బరువు వచ్చే విధంగా సి-01 బైకును డిజైన్ చేశారు.

100 కు పైగా లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్
పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సరైన సమధానం...!!


Click it and Unblock the Notifications








