మహీంద్రా చేతికి బిఎస్‌ఎ మోటార్ సైకిల్ కంపెనీ
మహీంద్రా బిఎస్‌ఎ మోటార్ సైకిల్స్ కంపెనీని కొనుగోలు చేసింది. బిఎస్ఎకు చెందిన క్లాసిక్ బైకుల తయారీ మరియు అమ్మకాలకు సంభందించిన పూర్తి హక్కులు సొంతం చేసుకుంది.
దేశీయ పరిజ్ఞానంతో తమదైన శైలిలో అన్ని వాహన రంగాల్లోకి ప్రవేశించిన మహీంద్రా సంస్థ క్లాసిక్ బైకులను తయారు చేసే బిఎస్ఎ ను కొనుగోలు చేసింది. బిఎస్ఎలోని ఉత్పత్తుల తయారీ, అభివృద్ది మరియు అమ్మకాలకు చెందిన అనేక ఒప్పందాల ద్వారా సంస్థ 100 శాతం సొంతం చేసుకుంది మహీంద్రా.

ఇంగ్లాడుకు చెందిన చెందిన క్లాసిక్ బైకుల తయారీ సంస్థ బిఎస్ఎ ను మహీంద్రా సుమారుగా 28 కోట్ల రుపాయలు34 లక్షల పౌండ్లు) వెచ్చించి కొనుగోలు చేసింది.

ఏడాది ముగిసే నాటికి బిఎస్ఎకు చెందిన పూర్తి హక్కులు మహీంద్రా సొంతం కానున్నాయి.

మహీంద్రా నార్టాన్ లేదా బిఎస్ఎలలో ఏదో ఒక దానిని కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉండేది. అయితే తాజాగా బిఎస్ఎను కొనుగోలు చేసింది.

సబ్సిడరీ క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిపిసిఎల్) సంస్థ అక్టోబర్ 21, 2016 న బిఎస్ఎ కంపెనీ లిమిటెడ్‌ను షేర్ క్యాపిటల్ ద్వారా 100 శాతం తన వశం చేసుకుంది.

ఒక్కో షేర్‌కు 2,611.46 రుపాయలు చెల్లించి 1.2 లక్షల షేర్లను కొనుగోలు చేసిన సబ్సిడరీ సంస్థ నుండి బిఎస్ఎ ను సొంతం చేసుకున్నట్లు మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.

సిపిసిఎల్ నుండి వశం చేసుకున్న బిఎస్ఎ కు చెందిన పూర్తి స్థాయి లైసెన్స్ మరియు అనుతలను గ్రహించనుంది. తద్వారా అంతర్జాతీయ బిఎస్ఎ ఉత్పత్తుల తయారీ మరియు అమ్మకాలకు మార్గం సుగమం కానుంది.

ఇంగ్లాడ్ ఆధారిత బిఎస్ఎ సంస్థ ప్రస్తుతం జపాన్, సింగపూర్, మలేషియా, అమెరికా, మెక్సికో మరియు కెనడా వంటి దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

గత ఏడాదిలో ప్యూజో మోటార్ సైకిల్స్ (పిఎమ్‌టిసి)లో మహీంద్రా సుమారుగా 51 శాతం వాటాను సొంతం చేసుకుంది.

ప్యూజోలో ఒక భాగంగా ఉన్న ఫ్రాన్స్ ఆధారిత పిఎస్ఎ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. ద్విచక్ర వాహన సెగ్మెంట్లో ఏ విధమైన ప్రణాళికతో ఉందో అనే విశయం ఇంకా వెల్లడికాలేదు.

టెక్ మహీంద్రా విభాగం క్రింద పినిన్పారియాలోని 76.06 శాతం వాటాను 28 బిలియన్ డాలర్లను వెచ్చించి కొనుగోలు చేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా గతంలో సౌత్ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ మోటార్స్‌లో కూడా కొంత వాటాను సొంతం చేసుకుంది.

అంతే కాకుండా కైనటిక్ గ్రూప్‌నకు చెందిన ఎస్‌వైఎమ్ ను ప్రారంభించడానికి మహీంద్రా టూ వీలర్ల విభాగం చేతులు కలిపింది.

ఇక ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో రెవా ఎలక్ట్రిక్ కార్ సంస్థని కూడా తన సొంతం చేసుకుంది. ఇప్పుడు రెవాకు బదులుగా ఇ20 అనే నాలుగు డోర్ల ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది.

ప్రస్తుతం మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ మరియు అమ్మకాల పట్ల ధృడ నమ్మకంతో ఉంది.

- రెండు లక్షల వరకు ఆఫర్లు ప్రకటించిన హ్యుందాయ్: ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం.
- నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీలో కొత్త ట్విస్ట్
- పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాల క్షణాలు ! మీరు చూడటానికి సాధ్యపడనివి


Click it and Unblock the Notifications








