కైనటిక్ ఛాలెంజర్‌ను మళ్లీ విడుదల చేయనున్న మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్స్‌లోని అన్ని సెగ్మెంట్లలో కూడా ఆరంగ్రేటం చేసింది. అందులో టూ వీలర్ల సెగ్మెంట్ కూడా. మహీంద్రా టూ వీలర్స్ ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయలేకపోతోంది. ముఖ్యంగా ఇండియన్ కమ్యూటర్ సెగ్మెంట్లో ఉత్తమ ఫలితాల సాధనలో వెనకడుగు వేస్తోంది.

మొదటగా 2001 లో మహీంద్రా వారు కైనటిక్ ఛాలెంజర్ కమ్యూటర్ బైకును దేశీయంగా విడుదల చేశారు. అప్పట్లో వెనువెంటనే విడుదలైన హీరో స్ల్పెండర్, బజాజ్ బాక్సర్ మరియు టీవీఎస్ విక్టర్ వంటి వాటికి ఇది పోటీగా నిలిచింది. ఆ తర్వాత కాలంలో మహీంద్రా మార్కెట్ నుండి దీనిని తొలగించింది, అయితే ప్రస్తుతం ఈ కైనటక్ ఛాలెంజర్‌ను రీ డిజైన్ చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.
Also Read: మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.
మహీంద్రా ఈ కైనటక్ ఛాలెంజర్ మీద పనిచేస్తోంది అనే సమాచారం తప్ప దీనికి సంభందించిన డిజైన్ మరియు ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. అయితే మహీంద్రాలోని ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైకు సెంచ్యురోలోని 106.70సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఇంజన్‌ను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ రహదారి సొరంగాన్ని నిర్మిస్తున్న నార్వే
మహీంద్రా రీ లాంచ్ చేయనున్న ఈ కైనటక్‌ను తమ లైనప్‌లో ఉన్న సెంచ్యురో కన్నా తక్కువ స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం మహీంద్రా సెంచ్యురో ప్రారంభ ధర రూ. 52,200 లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది. ఈ కైనటిక్ ఛాలెంజర్ అందుబాటులోకి వస్తే సెంచ్యురో కన్నా తక్కువ ధరతో రానుంది.


Click it and Unblock the Notifications








