స్పెషల్ ఎడిషన్ రూపంలో మహీంద్రా మోజో విడుదల
పండుగ సీజన్‌లో అమ్మకాల వేటకు సిద్దమైన చాలా వాహన తయారీ సంస్థలు ఒక్కొక్కటిగా తమ ఉత్పత్తులను స్పెషల్ ఎడిషన్‌లో విడుదల చేస్తున్నాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి. మహీంద్రా టూ వీలర్స్ విభాగం ఇండియన్ మార్కెట్లోకి తమ మోజో బైకును స్పెషల్ ఎడిషన్ రూపంలో విడుదల చేసింది.

మహీంద్రా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన మోజో ను టూరర్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది. దీని ప్రారభం ధర రూ. 1.89 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది.

పూర్తి స్థాయిలో టూరింగ్ మోడల్‌గా విడుదలైన మోజో టూరర్ ఎడిషన్‌లో విభిన్నమైన ఫీచర్లను పరిచయం చేశారు.

దేశీయంగా టూరింగ్ ఔత్సాహికులకు విస్తృతమైన రైడింగ్ అవకాశాలను కల్పించే విధంగా ఈ మోజో టూరర్ ఎడిషన్‌ను అభివృద్ది చేసింది.

మహీంద్రా మోజో టూరర్ ఎడిషన్‌లో మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్, శాడిల్ బ్యాగ్, క్యారీయర్, పన్నియర్ మౌంట్, మొబైల్ హోల్డర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లున్నాయి.

రైడింగ్ ఔత్సాహికులకు అభివృద్ది పరచబడిన రైడింగ్ సౌలభ్యాన్ని కల్పించడం కోసం మహీంద్రా మోజో టూరర్ ఎడిషన్‌లోని ప్రతి ఫీచర్‌ను ప్రత్యేక శ్రద్ద వహించి ఎంచుకోవడం జరిగింది.

దూర ప్రాంత ప్రయాణాల కోసం రైడర్లు అత్యంత లగేజిని తీసుకెళ్లగలిగే అవకాశాన్ని కల్పించారు.

రైడర్‌కు మంచి అనుభూతిని కలిగించడానికి మహీంద్రా ఈ మోజో టూరర్ ఎడిషన్ ఎంచుకునేవారికి రైడింగ్ జాకెట్‌ను కూడా అందిస్తున్నారు. భద్రత మరియు నూతన శైలి పరంగా ఇది ఎంతో బాగుంటుంది.

సాంకేతికంగా మహీంద్రా మోజో టూరర్ ఎడిషన్‌లో 295సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 26.45బిహెచ్‌పి పవర్ మరియు 30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

21 లీటర్ల ఇంధనాన్ని నిల్వచేసుకునే సామర్థ్యం ట్యాంకు కలదు, మహీంద్రా వారి ప్రకారం దీని మైలేజ్ లీటర్‌కు 26 కిలోమీటర్లుగా ఉంది మరియు మోజో గరిష్ట వేగం గంటకు 147 కిలోమీటర్లు.

స్పెషల్ ఎడిషన్ మహీంద్రా మోజో

స్పెషల్ ఎడిషన్ మహీంద్రా మోజో

- అద్భుతమైన ధరతో విడుదలైన భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్
- అందమైన భామల నడుమ కియా రియో ప్రదర్శన
- సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!


Click it and Unblock the Notifications








