రెండు సైలెన్సర్లతో కొత్త డిజైన్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200
ఆటోమొబైల్స్ విషయానికి వస్తే మనకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవడం ఈ మద్య కాలంలో చాలా కామన్. అందులో బైకులకు ఎక్కువగా మోడిఫికేషన్స్ జరగడం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. బైకుల్లో కూడా డిజైన్ మరియు పనితీరు అనే రెండు అంశాల పరంగా మోడిఫికేషన్ చేయించుకుంటారు.
చాలా అరుదుగా కనిపించే పనితీరుకు సంభందించిన మోడిఫికేషన్ బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 లో చోటు చేసుకుంది.

బజాజ్ సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ మోడల్ పల్సర్ ఆర్ఎస్200 బైకులో పనితీరుకు సంభందించిన మోడిఫికేషన్ పరంగా వెనుక వైపున ఉన్న సింగల్ సైలెన్సర్ తొలగించి రెండు సైలెన్సర్లను సీటు క్రింది భాగంలో అందించారు.

ముంబాయ్ నగర ఆధారిత ఎగ్జాస్ట్ సిస్టమ్ మోడిఫికేషన్ సంస్థ మార్క్ పర్ఫామెన్స్ రేసింగ్ ఎగ్జాస్ట్ వారు ఈ బైకును మోడిఫై చేశారు.

ఇందులో అందించిన ఎగ్జాస్ట్ సిస్టమ్ నిజానికి స్టాక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే దీనిని స్టెయిన్ లెస్ స్టీల్ మరియు అల్ల్యూమినియం ఫినిషింగ్‌తో డిజైన్ చేశారు.

కొత్తగా ఇందులో అందించిన ఎగ్జాస్ట్ సిస్టమ్ అసలైన ఆర్ఎస్200 కన్నా ఎక్కువ పనితీరును కనబరుస్తుంది అని స్ఫష్టంగా చెప్పలేము. అయితే ఇది సుమారుగా 24.2బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.
దీని సౌండ్ బాగుందా అని ఇక్కడ ఉన్న వీడియోను గమనించండి ? బాగుంటో మార్క్ పర్ఫామెన్స్ రేసింగ్ ఎగ్జాస్ట్ వారిని సంప్రదించి మీ బైక్‌కు కూడా సైలెన్స్‌ను అమర్చుకోండి. 10,000 రుపాయులు విలువచేసే దీనికి ఒక ఏడాది పాటు వారంటీ కూడా కలదు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 మోడిఫికేషన్ ఫోటోలు

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 మోడిఫికేషన్ ఫోటోలు

కారు ఇన్సూరెన్స్‌లో విప్లవం... కేవలం సెకండ్లలోనే స్వతహాగా మీ అంతట మీరే భీమా చేసుకోండి


Click it and Unblock the Notifications








