మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

By Anil

ఇటలీకి చెందిన టూ వీలర్ల తయారీ సంస్థ ఎమ్‌వి అగస్టా ఇండియన్ మార్కెట్లోకి తమ మొదటి ఉత్పత్తిని మే 11, 2016 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ తాజాగా తమ బైకులను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి కైనటిక్ గ్రూపుతో చేతులు కలిపింది. త్వరలో "మోటర్‌రాయలీ" అనే పేరుతో ఎమ్‌వి అగస్టా బైకులను కైనటిక్ ఉత్పత్తి చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో.....

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఎమ్‌వి అగస్టా ఇండియన్ మార్కెట్లోకి ఏయే ఉత్పత్తులను విడుదల చేస్తుందో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే మూడు ముఖ్యమైన ఉత్పత్తులను భారతీయులకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

బ్రుటాలి 1090 అనే బైకును ఎమ్‌వి అగస్టా అనధికారికంగా గత ఏడాది నవంబర్‌లో 17.99 లక్షల ధరతో విడుదల చేసింది.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

అంతే కాకుండా ఎఫ్4 ఆర్ఆర్ అనే బైకుకు చెందిన బుకింగ్స్‌ను తెరిచినట్లు వదంతులు వచ్చాయి. అంతే కాకుండా దీని ధర సుమారుగా 35.50 లక్షల మధ్య ఉన్నట్లు తెలిసింది.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఈ ఎఫ్4 ఆర్ఆర్ బైకులో 1-లీటర్ కెపాసిటి గల ఇంజన్, రైడ్-బై-వైర్ టెక్నాలజీ, ఓహ్లిన్స్ ఎలక్ట్రిక్ సస్పెన్షన్ మరియు స్టీరింగ్ డ్యాంపర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

బ్రుటాలి 1090 బైకులో 1078 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 144 బిహెచ్‌పి పవర్ మరియు 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

గరిష్ట వేగం గంటకు 265 కిలోమీటర్లతో దూసుకెళ్లే ఈ బ్రుటాలి 1090 బైకు ధర సుమారుగా రూ. 19.3 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉన్నట్లు సమాచారం.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఎమ్‌వి అగస్టా విడుదల చేయనున్న జాబితాలో ఎఫ్‌3 800 అనే మోడల్ ఉన్నట్లు తెలిసింది. ఇందులో 798 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఈ ఎఫ్3 800 బైకులోని ఇంజన్ సుమారుగా 148 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు మరియు దీని గరిష్ట వేగం 296 కిలోమీటర్లుగా ఉంది.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఫీచర్ల పరంగా ఇందులో ఎనిమిది స్టేజ్‌లలో పనిచేసే ట్రాక్షన్ కంట్రోల్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి కలవు.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఇవే కాకుండా ఎమ్‌వి అగస్టా తాజాగా అభివృద్ది చేసిన 2016 బ్రుటాలి 800 బైకు కూడా ఇండియాలో విడుదలయ్యే ఎమ్‌వి అగస్టా బైకుల రేసులో ఉంది.

మే 11, 2016 న విడుదలకు సిద్దమైన ఎమ్‌వి అగస్టా

ఎమ్‌వి అగస్టా 2016 మే 06 న ఇండియన్ మార్కెట్లో అధికారికంగా తమ కొత్త బైకులతో అమ్మకాల ఆరంగ్రేటం చేయనుంది. దీని గురించి మే 6 న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తుంది. అంత వరకు తెలుగు డ్రై‌వ్ స్పార్క్‌తో కలిసి ఉండండి.

ఎక్కువ మంది చదివిన కథనాలు.....

రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!

ఇండియాలో అందుబాటులో ఉన్న 8 ఉత్తమ సిఎన్‌‌జి కార్లు

ఇండియాలో ఉన్న టాప్-10 ట్రాక్టర్ తయారీ సంస్థలు

More from DriveSpark

Article Published On: Tuesday, May 10, 2016, 16:36 [IST]
English summary
MV Agusta Launch Confirmed For May 11
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+