ఆక్టివా ఐ అప్‌డేటెడ్ వెర్షన్‌ను రూ. 50,255 ల వద్ద విడుదల చేసిన హోండా
దేశీయంగా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న టూ వీలర్లలో స్థానంలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారి ఆక్టివా మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ అమ్మకాలను మరింత పెంచడానికి హోండా సంస్థ తమ ఆక్టివాలోని ఐ మోడల్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌గా కేవలం రూ. 50,255 ఎక్స్‌షోరూమ్ (ముంబాయ్)గా విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు కోసం....

హోండా ఆక్టివా ఐ స్టాండర్డ్ వేరియంట్ నలుపు మరియు పియర్ల్ అమేజింగ్ వైట్ కలర్ అప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.

స్టాండర్డ్ వేరియంట్లోని కొత్త రంగులు పియర్ల్ ట్రాన్స్ మరియు క్యాండీ జాజి బ్లూ లుగా ఉన్నాయి.

డీలక్స్ రేంజిలో ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ రంగులో ఆక్టివా ఐ లభిస్తుంది. దీనితో పాటు పియర్ల్ అమేజింగ్ వైట్ మరియు ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్ రంగుల్లో కూడా లభిస్తుంది.

సాంకేతిక వివరాల పరంగా చూస్తే ఆక్టివా ఐలో 110 సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ హెచ్‌ఇటి ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.74 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారి కథనం ప్రకారం ఈ హోండా ఆక్టివా ఐ లీటర్‌కు 83 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని తెలిపింది. ఇందులో ఆప్షనల్‌గా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను అందించారు

జపాన్‌కు చెందిన హోండా సంస్థ ఈ ఆక్టివా ఐ స్కూటర్‌ను మూడు కొత్త రంగుల్లో మినహాయించి మరేవిధమైన మార్పులు ఇందులో చోటు చేసుకోలేదు.

ఈజిప్ట్ విమాన ప్రమాదం ఏలియన్స్ పనేనా ?


Click it and Unblock the Notifications