దేశీయ మార్కెట్లోకి సరికొత్త యాక్సెస్ 125 ను విడుదల చేసిన సుజుకి ప్రారంభ ధర రూ. 53,887 /-
సుజుకి టూ వీలర్ల సంస్థ బైకుల అమ్మకాల కన్నా స్కూటర్ల అమ్మకాలు ఆశాజనకంగానే ఉంది, అందులో యాక్సెస్ 125 స్కూటర్లదే పై చేయి. అందుకోసమే కాబోలు సుజుకి తమ యాక్సెస్ 125 స్కూటర్‌ను లేటెస్ట్ ఎడిషన్‌లో నేడు దేశీయ మార్కెట్లోకి విడుదల చేశారు. దీని ప్రారంభ ధర రూ. 53,887 లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ప్రకటించారు.
సుజుకి యాక్సెస్ 125 లేటేస్ట్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు
సుజుకి తమ రీ ఫ్రెష్డ్ యాక్సెస్ 125 స్కూటర్‌లో 125 సీసీ కెపాసిటి గల ఇంజన్ ను అందించారు. ఇది 8.9 బిహెచ్‌పి పవర్ మరియు 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్ వివరాలు
సుజుకి సంస్థ ఈ యాక్సెస్ 125 స్కూటర్‌లోని ఇంజన్‌లో సుజుకి ఎకో ఫెర్ఫామెన్స్ టెక్నాలజీతో రూపొందించారు. తద్వారా ఇది లీటర్‌కు 64 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

స్టీల్ వీల్స్ మరియు డ్రమ్ బ్రేకులు
ప్రస్తుతం సుజుకి తమ యాక్సెస్ 125 స్కూటర్‌ను రెండు వైపులా స్టీల్ చక్రాలు మరియు డ్రమ్ బ్రేకులతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అల్లాయ్ వీల్స్ మరియు డిస్క్ బ్రేకులు
సుజుకి తమ యాక్సెస్ 125 లేటెస్ట్ స్కూటర్‌లో అతి త్వరలో అల్లాయ్ వీల్స్ మరియు డిస్క్ బ్రేకులతో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

వెస్పా పోలికలతో
సుజుకి యాక్సెస్ 125 రీ డిజైన్‌డ్ స్కూటర్‌ను ముందు వైపు నుండి గమనిస్తే క్రోమ్‍తో తల చుట్టూ కట్టు కట్టిన విధంగా హెడ్ లైట్ కనపడుతుంది. అంతే కాకుండా పెద్దగా మరియు ఎక్కువ కోణీయ ఆకారంలో రూపొందించబడిన ఇండికేటింగ్ లైట్లు, పార్కింగ్ లైట్లు అన్ని కలిపి వెస్పా రూపాన్ని గుర్తుకు చేస్తాయి.

లభించు రంగులు
సుజుకి వారి లేటెస్ట్ యాక్సెస్ 125 స్కూటర్ ఐదు విభిన్న రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
- పియర్ల్ సుజుకి డీప్ బ్లూ నెం.2
- క్యాండీ సోనోమా రెడ్
- మెటాలిక్ మట్టీ ఫైబ్రోయిన్ గ్రే
- పియర్ల్ మిరేజ్ వైట్
- గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
- పొడవు 1870 ఎమ్ఎమ్
- వెడల్పు 655 ఎమ్ఎమ్
- ఎత్తు 1160 ఎమ్ఎమ్
- వీల్ బేస్ 1265 ఎమ్ఎమ్
- గ్రౌండ్ క్లియరెన్స్ 160 ఎమ్ఎమ్
- జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికా పైనే అనుమానం..!
- లక్ష దాటిన హ్యుందాయ్ క్రెటా కాంపాక్ట్ ఎస్‌యువి ఎస్‌యువి బుకింగ్స్
- రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ గొప్పతనం: క్లాసిక్ 350 మరియు 500

కొలతలు
సుజుకి వారి సరికొత్త యాక్సెస్ 125 స్కూటర్ యొక్క కొలతలు

అందుబాటులోకి
ప్రస్తుతం సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ దేశ వ్యాప్తంగా గల డీలర్ షిప్‌ల వద్ద అందుబాటులో ఉంది.

పోటి
దేశ వ్యాప్తంగా గెలుపు జెండా ఎగరవేస్తున్న హోండా ఆక్టివా మరియు పియాజియో వెస్పా స్కూటర్లకు పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








