త్వరలో రోడ్ల మీదకు రానున్న సూట్‌కేస్ లాంటి స్కూటర్లు
ఆధునిక ప్రపంచం వినియోగంలో ఉన్న ఉత్పత్తులను వివిధ రకాల రూపంలోకి మార్చి సరికొత్త డిజైన్‌లలో అందిస్తోంది. వాటిని చూడగానే క్రియేటివిటి ఇలా కూడా పనికొస్తుందా అని అశ్చర్యం వేస్తుంది. ఈ కథనంలో మీకు పరిచయం చేస్తున్న సూట్‌కేస్ రూపంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అలాంటిదే.
అయితే దీని రూపాన్ని చూసి ఇది పిల్లలు ఆడుకునేది అనుకుంటే పొరబాటే ప్రస్తుతం ఉన్న ఓ రకమైన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటుగానే నడుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు మన ఈ కథనం ద్వారా తెలుసుకుందాం....

బాక్స్ అనే సంస్థ ఈ విన్నూత్నమైన ఉత్పత్తికి 2012 కంటే ముందే శ్రీకారం చుట్టింది. 2012 లో తమ మొదటి ఉత్పత్తిని ప్రదర్శించింది.

మొత్తానికి 2016 నాటికి సూట్‌కేస్ తరహాలో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.

కేవలం 1 మీటర్ పొడవు మాత్రమే ఉండే ఈ ఇ-బైక్ 86 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఇందులో మూడు ఫేస్‌ల బ్రషెలెస్స్ మోటార్ కలదు. ఇది గరిష్టంగా 111ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆల్ డ్రైవ్ సిస్టమ్ పేటెంట్ పొందిన ఈ సంస్థ తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని రెండు చక్రాలకు పవర్‌ను అందించే విధంగా డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు.

బాక్స్ సంస్థ మూడు రకాల రేంజ్‌లలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. అందులో BOXX e, BOXX మరియు BOXX M లు ఉన్నాయి.

గరిష్ట రేంజ్
బాక్స్ సంస్థలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తుల గరిష్ట రేంజ్.
- BOXX e గరిష్ట రేంజ్ 32 కిలోమీటర్లు
- BOXX గరిష్ట రేంజ్ 64 కిలోమీటర్లు
- BOXX M గరిష్ట రేంజ్ 86 కిలోమీటర్లు
- BOXX e గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు
- BOXX గరిష్ట వేగం గంటకు 56 కిలోమీటర్లు
- BOXX M గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు
- BOXX e ధర 2,997 అమెరికన్ డాలర్లు
- BOXX ధర 3,797 అమెరికన్ డాలర్లు
- BOXX M ధర 4,987 అమెరికన్ డాలర్లు

గరిష్ట వేగం
బాక్స్ సంస్థ రూపొందించిన ఉత్పత్తుల యొక్క గరిష్ట వేగం

ధరలు
బాక్స్ సంస్థ రూపొందించిన ఉత్పత్తుల ధరలు

సూట్‌కేస్ ఆకారంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కావాలనుకునే వారు బాక్స్ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ఆర్డర్ చేయవచ్చు.

అమెరికా మిలిటరీలో అద్భుతం
ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం


Click it and Unblock the Notifications








