పియాజియో: ఆటోలు మాత్రమే కాదు స్కూటర్లు కూడా ఉత్పత్తి చేస్తున్నాం
దేశీయ మార్కెట్లో ఇప్పుడిప్పుడే స్కూటర్లు ప్రభావం బాగా పెరుగుతోంది. అందుకోసం చాలా వరకు టూ వీలర్ల సంస్థలు పోటి పడుతూ మన ముందు వివిధ రకాల ఉత్పత్తులను తీసుకువస్తున్నాయి. అందులో భాగంగానే దేశీయ మార్కెట్లోకి పియోజియో సంస్థ ఇటాలియన్ స్కూటర్ల సంస్థ వెస్పాతో చేతులు కలిపి తమ సరికొత్త క్రాసోవర్ స్పోర్టి అప్రిలియా ఎస్‌ఆర్-150 స్కూటర్‌ను గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

సాంకేతిక వివరాలు:
అప్రిలియా ఎస్‌ఆర్ 150 స్కూటర్‌లో 150 సీసీ కెపాసిటి గల ఇంజన్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందంచి దీనిని విడుదల చేశారు. ఈ క్రాసోవర్ స్కూటర్ ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున షాక్ అబ్జార్వర్లను కలిగి ఉంది. బ్రేకుల విషయానికి వస్తే ముందు వైపున 220 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపున 140 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులను ఇందులో కల్పించారు.
Also Read: హోండా నవీ స్కూటర్ కేవలం రూ. 39,500 లు మాత్రమే: మరిన్ని వివరాలకు
డిజైన్:
స్కూటర్లు అనగానే అందరూ ఒకే విధమైన డిజైన్‌ను ఊహించుకుంటారు. కాని దీని విషయంలో అలా డిజైన్ చేయలేదు. దీనిని ముందు వైపు నుండి చూసినట్లయితే బైకును పోలి ఉంటుంది, కాని దీని చక్రాలు మాత్రం చిన్నవిగా ఉంటాయి. వెనుకవైపు నుండి గమనించినట్లయితే ఇది అచ్చం స్కూటర్ డిజైన్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. చక్కటి డిజైన్ గల లైటు మరియు స్పోర్టివ్ అనుభూతిని కలిగించే హ్యాండిల్ బార్ ఇందులో కలవు.
Also Read: ఇటు వైపు కోహ్లి అటు వైపు ఆలియా భట్ మరి అనుష్క ఎటువైపు...?
అందుబాటులోకి:
దీని దేశీయ మార్కెట్లోకి ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు. మరియు 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద హోండా ప్రదర్శించిన నవీ క్రాసోవర్ స్కూటర్‌కు ఇది పోటిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications






















