నాగచైతన్య చేతుల మీదుగా దేశీయంగా రెండవ మెటోప్లెక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన పియాజియో

By Anil

పియాజియో ఇండియన్ మార్కెట్లోకి రెండవ అతి పెద్ద మోటోప్లెక్స్ స్టోర్‌ను నేడు హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ రెండవ అతి పెద్ద పియాజియో మోటోప్లెక్స్ స్టోర్‌ను ప్రముఖ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చేతుల మీదగా ప్రారంభించారు. పియాజియో తమ మొదటి మోటోప్లెక్స్ స్టోర్‌ను పూనే‌లో ఇది వరకే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని స్టోర్‌ శ్రేయా ఆటోమోటివ్ వారి ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగించనుంది.

చైతు చేతుల మీదుగా హైదరాబాద్‌లో పియాజియో మోటోప్లెక్స్ ప్రారంభం

పియాజియో మోటోప్లెక్స్ రెండవ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన వేడుకలో టాలీవుడ్ యువ కథానాయకుడు నాగ చైతన్యతో పాటు పియాజియో ఇండియా సిఇవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ స్టీఫన్ పెల్లె మరియు హైదరాబాద్ మోటోప్లెక్స్ సిఇఓ సూశీల్ దగ్గర్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు.

చైతు చేతుల మీదుగా హైదరాబాద్‌లో పియాజియో మోటోప్లెక్స్ ప్రారంభం

హైదరాబాద్ పియాజియో మోటో ప్లెక్స్ స్టోర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉండే అప్రిలియా, మోటో గుజ్జి మరియు వెస్పా శ్రేణి ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి.

చైతు చేతుల మీదుగా హైదరాబాద్‌లో పియాజియో మోటోప్లెక్స్ ప్రారంభం

టూ వీలర్లతో పాటుగా పియాజియో సంస్థ వారి లైఫ్ స్టైల్ ఉత్పత్తులు కూడా ఈ స్టోర్‌ నుండి అందుబాటులో ఉండనున్నాయి.

చైతు చేతుల మీదుగా హైదరాబాద్‌లో పియాజియో మోటోప్లెక్స్ ప్రారంభం

పియాజియో మోటోప్లెక్స్ స్టోర్‌ను జూబ్లిహిల్స్‌లో ప్రారంభించారు. ఇది 4,134 చదరపు అడుగుల విస్తీర్ణంలో కలదు. ఈ స్టోర్‌ను న్యూ యార్క్, షాంఘై మరియు బీజింగ్‌లలో డిజైన్‌ చేసిన రీతిలో ప్రత్యేక డిజైన్‌ నిపుణలతో డిజైన్ చేయించారు. ఇందులో సేల్స్,సర్వీసింగ్ మరియు స్పేర్స్ అనే 3ఎస్ సేవలు అందివ్వనున్నారు.

చైతు చేతుల మీదుగా హైదరాబాద్‌లో పియాజియో మోటోప్లెక్స్ ప్రారంభం

ఈ స్టోర్‌ నందు ఇటాలియన్‌కు చెందిన మూడు ఉత్పత్తులతో పాటు ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా అతి త్వరలో రానున్న అప్రిలియా ఎస్‌ఆర్150 స్కూటర్‌ ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల సరసన చేరనుంది.

మరిన్ని కథనాల కోసం....

ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు

బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....!!

More from DriveSpark

Article Published On: Friday, May 20, 2016, 16:15 [IST]
English summary
Piaggio Inaugurates Second Motoplex Outlet In Hyderabad By Nagachaitanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+