విపణిలోకి ఖరీదైన వెస్పా స్కూటర్లు విడుదల: ధర రూ. 12.04 లక్షలు
పియాజియో గ్రూప్ ఎట్టకేలకు తమ లిమిటెడ్ ఎడిషన్ వెస్పా 946 ఎంపోరియో అర్మాని మరియు 70 వార్షికోత్సవ ఎడిషన్ స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. అయితే వీటి ధరలు మాత్రం లక్షల్లో ఉన్నాయి.
పియాజియో నేడు (నవంబర్ 15, 2016 న) విపణిలోకి రెండు కొత్త స్కూటర్లను విడుదల చేసింది. పూనే నగర వేదికగా వెస్పా 946 ఎంపోరియో అర్మాని లిమిటెడ్ ఎడిషన్ మరియు 70వ వార్షికోత్సవ ఎడిషన్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. అయితే రెండు కూడా లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులే.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మాని లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 12.04 లక్షలు మరియు వెస్పా 70 వ వార్షికోత్సవ ఎడిషన్ ధర రూ. 96,500 లు, రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా ఉన్నాయి.

పియాజియో వెస్పా 946 ఎంపోరియో అర్మాని స్కూటర్‌ను జియార్జియో అర్మాని మరియు పియాజియో సంస్థలు సంయుక్తంగా 2015 లో డిజైన్ చేసారు.

జియార్జియో అర్మాని ఫ్యాషన్ హౌస్ ప్రారంభమైన 40 వార్షికోత్సవ సందర్బంగా మరియు పియాజియో గ్రూప్ అవతరించి 130 ఏళ్లు పూర్తయినందున 130 వ పుట్టిన రోజు సందర్భంగా ఇరు సంస్థలు కలిసి ఈ వెస్పా 946 ఎంపోరియో అర్మాని స్కూటర్‌ను రూపొందించారు.

వెస్పా 946 ఎంపోరియో అర్మాని స్కూటర్‌ను ఎంపోరియ అర్మాని డిజైన్ చేశారు. ఈ స్కూటర్ మీద అర్మాని సిగ్నేచర్ కూడా అందించారు.

బాడీ మొత్తం గ్రే పెయింట్ జాబ్ తో డిజైన్ చేశారు. సీట్ మరియు అదనపు క్యారీర్ బాక్స్‌ను బ్రౌన్ కలర్‌లో అందించారు. దీని మీద కాంతి పడినపుడు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ వెస్పా 946 ఎంపోరియో అర్మాని స్కూటర్‌లో ముందువైపున చిన్న పరిమాణంలో ఉన్న ఎల్ఇడి హెడ్ లైట్ (ఎంపోరియో అర్మాని వారి ఇకానిక్ ఈగల్ లోగో పై భాగంలో అందించారు), స్మార్ట్ ఫోన్ అనుసంధానం గల ఎస్‌సిడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

అరుదైన ఎంపోరియో అర్మాని అనే పేరును స్కూటర్‌కు కుడి పార్శం మీద అడుగు భాగాన ఆంగ్లంలో గుర్తించగలరు.

పియాజియో సంస్థ వెస్పా బ్రాండ్ పేరును పరిచయం చేసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 వ వార్షికోత్సవ ఎడిషన్‌ను విఎక్స్ఎల్ వేరియంట్‌గా విడుదల చేసారు.

ఈ స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ వెస్పా ఎక్స్‌క్లూజివ్ అజురో 70 బాడీ కలరు, 70 వ వార్షికోత్సవ ఎడిషన్ అని గుర్తించేందుకు చిహ్నాన్ని సరికొత్త బ్రౌన్ లెథర్ సీటు మీద అందించారు.

వెస్పా 946 ఎంపోరియో అర్మాని స్కూటర్లు కంప్లిట్లీ బిల్ట్ యూనిట్లుగా దేశీయంగా ఉన్న పియోజియో గ్రూప్ యొక్క మోటో ప్లెక్స్ షోరూమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరియు వెస్పా 70 వ వార్షికోత్సవ ఎడిషన్ స్కూటర్లను దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నారు మరియు ఇది సాధారణ అన్ని వెస్పా షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

- ఇగ్నిస్ గురించి గుడ్ న్యూస్
- వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్
- మిలిటరీ రైళ్ల గురించి.. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..


Click it and Unblock the Notifications








